టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో స్టార్ హీరోల సినిమాల నుండి డెబ్యూ హీరోల సినిమాల వరకు షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొన్ని స్టార్ హీరోల సినిమాలు ఈ నెలలో రిలీజ్ డేట్ వేసి వున్నాయి. కానీ బంద్ కారణంగా అవి కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. బంద్ మొదలైన రోజు ఒకటి రెండు రోజుల్లో అంతా నార్మల్ అవుతుందని భావించి రిలీజ్ డేట్స్ వేశారు నిర్మాతలు. కానీ ఇప్పటికి 14 రోజులుగా బంద్ సాగుతూనే ఉంది. ఎప్పుడు ఆగుతుందో క్లారిటీ లేదు.
Also Read : Tollywood : పాన్ ఇంటర్నేషన్‌గా తెలుగు సినిమా.. మహేశ్, బన్నీ, ప్రభాస్ సినిమాల్లో హాలీవుడ్ స్టార్స్..
బంద్ కారణంగా వాయిడా పడుతున్న ఫస్ట్ సినిమా మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న ‘మాస్ జాతర’. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మాంటేజ్ సాంగ్ ఒకటి కొంత ప్యాచ్ వర్క్ షూట్ పెండింగ్ ఉంది. ముందుగా ప్లాన్ చేసిన షెడ్యూల్ ప్రకారం ఒక వారంలో రోజుల్లో షూట్ ఫినిష్ కావాలి. కానీ కార్మిక సంఘాలు షూటింగ్స్ కు బంద్ ప్రకటించారు. మరోవైపు మాస్ జాతర సినిమాను ఈ నెల 27న రిలీజ్ చేస్తున్నామని డేట్ కూడా వేసేసారు. ఇటు చూస్తే కార్మికులకు సమ్మె. దాంతో మాస్ జాతర విడుదలను వాయిదా వేశారు మేకర్స్. నేడో రేపో ఇందుకు సంబందించి అధికారిక ప్రకటన రానుంది. దీపావళి కనుకగా రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు. ఎప్పుడు చేయాలన్న షూటింగ్స్ తిరిగి స్టార్ట్ కావాలి. కానీ అది ఎప్పుడు అనేది ఎవరికీ క్లారిటీ లేదు.
