Tollywood : పాన్ ఇంటర్నేషన్‌గా తెలుగు సినిమా.. మహేశ్, బన్నీ, ప్రభాస్ సినిమాల్లో హాలీవుడ్ స్టార్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా పాన్ ఇండియాను దాటిపోయింది. పెద్ద సినిమా అంటే ఇక నుంచి పాన్ ఇంటర్నేషన్ మూవీనే. నిన్నటివరకు పాన్ ఇండియా మూవీ కోసం.. హిందీ.. కన్నడ.. తమిళం.. మలయాళం నుంచి నటీనటులను దిగుమతి చేసుకున్నారు. ట్రెండ్ మారింది. ఇక నుంచి హాలీవుడ్ స్టార్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. పూరీ జగన్నాథ్ లైగర్ కోసం ఏరికోరి మైక్ టైసన్‌ను తీసుకొచ్చాడు పూరీ. పెద్దగా ఇంపార్టెంట్ లేని రోల్‌ను టైసన్‌కు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సినిమా ఫ్లాప్ కావడంతో మైక్ టైసన్‌కు మరో ఛాన్స్ దక్కలేదు.
బాహుబలితో తెలుగు సినిమాను పాన్ ఇండియాకు ఆర్ఆర్ఆర్తో పాన్ వరల్డ్‌కు తీసుకెళ్లిన ఘనత రాజమౌళీకే దక్కుతుంది. జక్కన్న నెక్ట్స్ మూవీ కోసం హాలీవుడ్ వెయిట్ చేస్తున్నట్టు స్టార్ డైరెక్టర్స్ స్పీల్బర్గ్ జేమ్స్ కామెరూన్ చెప్పారు. హాలీవుడ్ యాక్టర్స్‌తో పని చేయడం జక్కన్నకు కొత్తేమీ కాదు. ఆర్ఆర్ఆర్లో జెన్నిఫర్‌గా ఒలీవియా మోరిస్ గవర్నర్ స్కాట్‌గా రే స్టీవెన్సన్ లేడీ స్కాట్‌గా సాముతిరాకని నటించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి మహేశ్‌తో యాక్షన్ ఎడ్వెంచర్ తీస్తున్నాడు. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడన్న టాక్ వచ్చినా మెయిన్ విలన్‌గా హాలీవుడ్ యాక్టర్‌ను తీసుకుటుంన్నాడట. క్రిస్ హేమ్స్‌వర్త్ పేరు వినిపిస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన 41 ఏళ్ల క్రిస్ వరల్డ్ హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్స్‌లో ఒకడు. ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి వచ్చే ప్రభాస్, సందీప్ వంగా సినిమా ‘స్పిరిట్’ కోసం కొరియన్ స్టార్ డాన్ లీని తీసుకుంటున్నారట. ఈ హాలీవుడ్ స్టార్‌కు ఆల్రెడీ కథ చెప్పిన సందీప్ పేరు ఎనౌన్స్ చేయాల్సి వుంది హాలీవుడ్ రేంజ్ కాన్సెప్ట్‌తో ఔట్ అండ్ ఔట్ విఎఫ్ఎక్స్తో అల్లు అర్జున్, అట్లీ సినిమా రూపొందుతోంది. హీరోయిన్గా దీపిక పేరును మాత్రమే ప్రకటించినా.. ఇంకో ముగ్గురికి చోటుంది. రష్మిక, మృణాల్ ఠాకూర్.. జాన్వి కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక విలన్‌గా హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ పేరు బైటకొచ్చింది. ఆస్కార్ అందుకున్న విల్ స్మాత్ భారతీయ హిందీ చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2’లో అతిథిగా సందడి చేశాడు.
Also Read
- Rudravanam PS: మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. అక్టోబర్ 30 నుంచి ‘రుద్రవనం పీఎస్’ స్ట్రీమింగ్.!
- Pocket Rockets: నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘పాకెట్ రాకెట్స్’.. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో యూత్‌ఫుల్ డ్రామా.!
- Vishwak Sen: ‘కల్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్.. ఎందుకో చెప్పిన విశ్వక్సేన్!
- Mouli: ఐదో తరగతిలో భయపడి ఏడ్చా.. ఇప్పుడు మైత్రీ మూవీస్‌తో సినిమా
తాజావార్తలు
-
AP Cabinet: ముగిసిన కేబినెట్ భేటీ.. 48 ప్రతిపాదనలకు ఆమోదం.. స్థానిక ఎన్నికలపై సీఎం కీలక సూచనలు!
-
PM Kisan 24th Installment 2026: PM-KISAN 24వ విడత.. రైతుల ఖాతాల్లోకి రేపే రూ.2,000.. ఈసారి ప్రత్యేకత ఏంటంటే?
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
Supreme Court: మహిళల హక్కుల కోసం ట్రాన్స్విమెన్ల అస్తిత్వాన్ని విస్మరించాలా? సుప్రీంకోర్టులో కొత్త వివాదం
ట్రెండింగ్
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!
-
RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!