NTV Telugu Site icon

Anil ravipudi: షూటింగ్ స్టార్ట్ కాలేదు..రిలీజ్ డేట్ ఫిక్స్..ఏ సినిమా అంటే ..?

Untitled Design (12)

Untitled Design (12)

విక్టరీ వెంకటేష్ ఇటీవల సైంధవ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. తాజగా వెంకీ మరో చిత్రాన్ని ప్రారంభించాడు.  గతంలో  F2, F3 వంటి రెండు సూపర్ హిట్లు అందించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ నటించనున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన కూడా ఇటీవల విడుదల చేసారు మేకర్స్. గతంలో హాస్యం ప్రధానంగా సాగే కథాంశాన్ని ఎంచుకున్న అనిల్ రావిపూడి ఈ దఫా సరికొత్త కథతో రానున్నాడు. ‘ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ పోలీస్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ థీమ్’ లో సాగనుంది ఈ చిత్రం.

కాగా ఈ చిత్రాన్ని ఆగస్టు నుండి షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  ఈ చిత్రంలో వెంకీ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ప్రస్తుతం అందుకు తగ్గట్టు లుక్ మార్చే పనిలో ఉన్నారు. ఆగస్టు మొదటి వారంలో వెంకీ మామ ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారు. ఆగస్టు నుండి కంటిన్యూ షూట్ చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి గతంలో చేసిన సరిలేరు నీకెవ్వరు చిత్రన్ని కేవలం ఐదు నెలల్లో తీశారు. వెంకీతో తెరకెక్కించే చిత్రం కూడా ఐదు నెలల్లో షూటింగ్ ముగించి 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు పక్కా ప్లానింగ్ వేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు . వెంకీ,అనిల్ రావిపూడి, దిల్ రాజుల హ్యాట్రిక్ కాంబోగా గా ఈ చిత్రం రానుంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి వెంకీ సరసన జోడీలుగా నటించనున్నారు. ఈ చిత్రానికి “సంక్రాంతికి వస్తున్నాం” అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

 

Also Read: Chiranjeevi : మెగాస్టార్ 157 స్టోరి రెడీ..దర్శకుడు ఎవరంటే..?