Site icon NTV Telugu

Shiva 4K: నాగ్ మామ దిగుతుండు.. గెట్ రెడీ

Shiva Re Release

Shiva Re Release

నాగార్జున హీరోగా నటించిన ‘శివ’ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘విక్రమ్’ సినిమాతో లాంచ్ అయిన నాగార్జునకి ‘శివ’ సినిమా మాత్రం ఒక సాలిడ్ స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఈ సినిమాలో హీరోయిన్‌గా అమల నటించింది. కాలేజ్ స్టూడెంట్స్ గొడవల బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించిన ఈ సినిమా అప్పట్లోనే ఒక ప్రభంజనం సృష్టించడమే కాదు, ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.

Also Read: Athadu : త్రివిక్రమ్ కొడుక్కి సీరియస్.. ఎవరికీ చెప్పకుండా షూటింగ్!

ఇక ఈ సినిమాని ఇప్పుడు 4K వెర్షన్‌లో తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ సినిమాని రీ-రిలీజ్ చేయాలని చాలా కాలం నుంచి నాగార్జున అభిమానులు కోరుతూ వస్తున్నారు. ఎట్టకేలకు ఆ కోరిక తీర్చేందుకు సిద్ధమయ్యారు అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ. 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ‘కూలీ’ థియేటర్లలో ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ టీజర్ యాడ్ చేస్తామని ప్రకటించారు. దీంతో నాగు మామ ‘శివ’ సినిమాతో దిగుతున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Exit mobile version