Shine Tom Chako: డ్రగ్స్ రైడ్ తప్పించుకునేందుకు సాహసం.. 3వ ఫ్లోర్ నుంచి దూకి మరీ పరార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ నటుడు, ఈ మధ్యకాలంలో పలు సౌత్ సినిమాల్లో నటిస్తున్న షైన్ టామ్ చాకో, డ్రగ్స్ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అతనిపై మలయాళ నటి విన్సీ, మలయాళ నటీనటుల సంఘం ‘అమ్మ’కి ఫిర్యాదు చేసింది. షూటింగ్ సెట్లోనే డ్రగ్స్ తీసుకుని తనను ఇబ్బంది పెట్టినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే, ఈ నేపథ్యంలో అతని వద్ద డ్రగ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసేందుకు వెళ్లిన పోలీసులను మాస్క్ కొట్టి షైన్ తప్పించుకున్నాడు.
Shine Tom Chacko : డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న నాని విలన్?
Also Read
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
- Anupama - Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
- Balakrishna : బాలయ్యకి సర్జరీ.. NBK 111 పరిస్థితి ఏంటి?
మలయాళ టీవీ ఛానెల్‌లలో ప్రచారం జరుగుతున్న దాని మేరకు, షైన్, అతనితో పాటు ఉన్న మరో ఇద్దరు అనుచరులతో కలిసి ఒక హోటల్ మూడో అంతస్తు కిటికీ నుంచి దూకి మాయమైనట్లు తెలుస్తోంది. ముందుగా మూడో అంతస్తు నుంచి రెండో అంతస్తుకు దూకి, అక్కడి నుంచి స్విమ్మింగ్ పూల్‌లోకి దూకి, ఆ స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చి రిసెప్షన్ ద్వారా పారిపోయినట్లు తెలుస్తోంది. బుధవారం అర్ధరాత్రి రైడ్ జరుగుతున్న విషయం తెలుసుకుని అతను పారిపోయినట్లు సమాచారం.
కేరళ పోలీసులతో పాటు కేరళ పోలీసుల డిస్ట్రిక్ట్ యాంటీ నార్కోటిక్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్ రైడ్ చేసిన తర్వాత, షైన్ రూమ్‌లో ఎలాంటి అనధికార వస్తువులు దొరకలేదని చెబుతున్నారు. ప్రస్తుతానికి అతను పరారీలో ఉన్నాడని, అందుబాటులోకి వచ్చిన తర్వాత అతన్ని విచారించే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ విషయంపై స్పందించిన షైన్ తల్లి మరియా, తన కొడుకు భయంతో పారిపోయి ఉండవచ్చని పేర్కొన్నారు. “నార్కోటిక్ అధికారులు అతని రూమ్‌లో ఏమైనా తప్పుగా కనుగొన్నారా? నాకు అతని గురించి బాగా తెలుసు. భయపడి పారిపోయి ఉండవచ్చు. పోలీసులు కూడా అక్కడికి యూనిఫామ్‌తో వెళ్లలేదు,” అని ఆమె ఆరోపించారు.
ఇటీవల తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలో కూడా షైన్ ఒక చిన్న పాత్రలో కనిపించాడు.
తాజావార్తలు
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్‌పై ఘన విజయం..
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!