Sharwanand-Bhogi: ఒత్తిడి, భయం లేవు.. అందర్నీ సంతృప్తిపరుస్తా.. ‘భోగి’పై శర్వా ఆసక్తికర వ్యాఖ్యలు!

Sharwanand Bhogi Pre Release Event

Sharwanand Bhogi Pre Release Event

Sharwanand about Bhogi Movie: టాలీవుడ్‌ హీరో శర్వానంద్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు సంపత్‌ నంది దర్శకత్వం వహించారు. కె.కె. రాధామోహన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో డస్కీ బ్యూటీ డింపుల్‌ హయాతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 27న ‘భోగి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలో హీరో శర్వానంద్‌ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సాధారణంగా ప్రతి సినిమా విడుదలకు ముందు కొంత ఒత్తిడి ఉంటుందని.. అయితే భోగి విషయంలో తనకు ఎలాంటి ఒత్తిడి, భయం లేవని స్పష్టం చేశారు. సినిమా ఫస్ట్‌ కాపీ చూసినప్పుడే ఎంతో సంతృప్తి కలిగిందని, ప్రేక్షకులను కూడా తప్పకుండా సంతృప్తిపరుస్తాననే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాతో నటుడిగా తనలోని మరో కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న దర్శకుడు సంపత్‌ నందికి శర్వానంద్‌ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. భోగి తన కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

భోగి చిత్రానికి భీమ్స్‌ సంగీతం అందించగా, చంద్రబోస్‌ పాటలకు సాహిత్యం సమకూర్చారు. దిలీప్‌ సుబ్బరాయన్‌ ఫైట్స్‌ సినిమాకు ఆకర్షణగా నిలుస్తాయని శర్వానంద్‌ తెలిపారు. అలాగే కిరణ్‌ ఆర్ట్‌ వర్క్‌ కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే విడుదల తేదీ దగ్గరపడటంతో భోగిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రీ రిలీజ్‌ వేడుకలో సంపత్‌ నంది, శర్వానంద్‌, రాధామోహన్, డింపుల్ హయాతి, భీమ్స్‌ సిసిరోలియో, చంద్రబోస్‌ తదితర పాల్గొన్నారు.