Site icon NTV Telugu

Sharukhan : ‘కింగ్’ మూవీలో మరో హీరో..

The King

The King

బాలీవుడ్ బాద్​షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారుక్​తో పాటు ఆయన కుమార్తె సుహానా ఖాన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ జానర్​ లో రాబోతున్న ఈ మూవీ లో ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఓ స్పెషల్ రోల్​ కోసం మూవీ టీమ్ ​దీపికను సంప్రదించిందట. ఆమె షారుక్ కుమార్తె సుహానా కు ఆన్​స్క్రీన్​లో తల్లిగా కనిపించనున్నారని టాక్. అలాగే షారుక్ మాజీ ప్రియురాలిగానూ దీపిక మెరవనున్నారట. సినిమా స్టోరీ లో దీపిక పాత్ర కీలకంగా ఉంటుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీని గురించి అధికారికంగా ప్రకటన రానపట్టికి.. తాజాగా ఈ మూవీ గురించి బీ టౌన్‌లో ఓ క్రేజీ వార్త చక్కర్లు కొడుతోంది.

Also Read : Kantara 2 : ‘కాంతార2’ టీమ్‌లో మ‌రొక‌రు మృతి..

ఏంటీ అంటే.. ఈ సినిమాలో షారుక్ కు గురువు పాత్రలో సీనియర్ హీరో అనిల్ కపూర్ కనిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయమై అనిల్ తో చిత్రబృందం చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్ ఆనంద్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బాలీవుడ్ సమాచారం.

Exit mobile version