NTV Telugu Site icon

Shalini Pande : ఓటీటీలకు ప్రాధాన్యతనిస్తోన్న షాలిని పాండే

Shalini

Shalini

అది నా పిల్లరా అంటూ విజయ్ దేవరకొండతో అనిపించుకున్న క్యూటీ గర్ల్ షాలిని పాండే. అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా ఛేంజ్ అయ్యింది. చబ్బీగా, బబ్లీ లుక్స్‌లో యూత్ ను మెస్మరైజ్ చేసింది. ఈ క్రేజ్ చూసి మేడమ్ కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుంది అనుకున్నారు. కట్ చేస్తే  స్టార్ హీరోయిన్ ఇమేజ్ కోసం పాకులాడుతోంది. తెలుగులో మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 118, ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్దం తర్వాత సైలెంట్ అయ్యింది. మధ్య మధ్యలో తమిళ్, హిందీ సినిమాలంటూ ఆ ఇండస్ట్రీల్లో కూడా చక్కర్లు కొట్టింది.

Also Read : Prabhas : రెబల్ స్టార్ ‘ప్రభాస్’ పేరుతో ఊరు.?

కానీ ఎక్కడా స్టార్ డమ్ రాలేకపోయింది. రణవీర్ సింగ్ లాంటి స్టార్ హీరో కూడా ఆమె ఫేట్ మార్చలేకపోయాడు. ప్రైవేట్ ఆల్బమ్‌లో కూడా జిగేల్ మని మెరిసింది. అదే టైంలో అమీర్ సన్ జునైద్ ఖాన్ హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన మహరాజ్‌లో నటించే ఛాన్స్ కొల్లగొట్టింది. ఓటీటీలో రిలీజైన మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రీసెంట్లీ మహారాజ్‌తోనే ఓటీటీ బెస్ట్ పాపులర్ యాక్ట్రెస్‌గా ఐకానిక్ గోల్డెన్ అవార్డ్ విన్ అయ్యింది. ఓటీటీలో నేమ్, ఫేమ్ రావడంతో సిల్వర్ స్క్రీన్ కన్నా డిజిటల్ స్క్రీన్ పై ఫోకస్ చేస్తుంది షాలిని పాండే. అందుకే సౌత్ ఇండస్ట్రీకి దూరమైనట్లుంది. ప్రజెంట్ డబ్బాకార్టెల్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. అలాగే బ్యాండ్ వాలే అనే మరో సిరీస్ చేస్తోంది. ఇవే కాదు తొమిదేళ్ల తర్వాత కోలీవుడ్ లో ధనుష్, నిత్యామీనన్ జంటగా నటిస్తోన్న ఇడ్లీ కడాయ్‌లో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా కనిపించబోతుంది.  టాలీవుడ్ లో అమ్మడికి అవకాశం ఎప్పుడు వస్తుందో.