రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఇందులో హీరోయిన్‌గా నటించిని షాలిని పాండే మొదటి చిత్రం తోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన అందం, అమాయకత్వం, సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులో, ముఖ్యంగా యూత్‌లో మంచి ఫ్యాన్ బేస్ దక్కించుకుంది. దీంతో ఆమె స్టార్ హీరోయిన్‌గా మారిపోతుంది అనుకున్నారు కానీ ఆషించినంతగా అవకాశాలు రాలేదు. అర్జున్ రెడ్డి తర్వాత ఈ హీరోయిన్ చేసిన సినిమాలు ఏవి కూడా పెద్ద సక్సెస్ సాధించలేదు. దీంతో ప్రజంట్ హిందీ, తమిళ భాషలో సినిమా, సిరీస్‌లో నటిస్తూ అక్కడ తన టాలెంట్‌ను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది..
Also Read: SSMB29 : మహేష్, రాజమౌళి బిగ్ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ ఇదేనా..?
మనకు తెలిసి రణ్ బీర్ కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. చాలా మంది హీరోయిన్‌లు ఆయనతో నటించడానికి ఆరాట పడుతుంటారు. కనీసం ఆయన పక్కన కనిపించిన చాలు అనుకునే హీరోయిన్‌లు కూడాచాలా మంది ఉన్నారు. అందులో షాలిని పాండే కూడా ఒకరు. రీసెంట్‌గా రణబీర్ కపూర్‌తో నటించాలని తన కోరికను వ్యక్తం చేసింది షాలిని ‘రణబీర్ కపూర్ నటనలో ఒక మాయ ఉంటుంది. అతని కళ్లలో ప్రత్యేకమైన ఆకర్షణ కనిపిస్తుంది. రణ్ బీర్‌తో కలిసి ఒక్కరోజైనా పని చేయాలని.. తెరపై ప్రేమగా కనిపించాలనేది నా కోరిక. ప్రతి ఒక మూవీలో అతని నటనలో మార్పు కనిపిస్తూనే ఉంటుంది. అది అతని మ్యాజిక్’ అని చెప్పుకొచ్చింది షాలిని.