NTV Telugu Site icon

Shah Rukh : దర్శకుడిగా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్

Sharuk

Sharuk

స్టార్ హీరోల వారసులు వెండితెరకు ఎంట్రీ ఇస్తున్నారు. కానీ హీరోలుగా కంటే కూడా దర్శకులుగా ఎంట్రీ ఇచ్చేందుకు సుముఖత చూపిస్తున్నారు. తండ్రులకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి కూడా వారసులు మాత్రం దర్శకులుగానే ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా తోలి సినిమాను యంగ్ హీరో సుందీప్ కిషన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ లో చేస్తున్నాడు.డిసెంబరులో ఈ సినిమా స్టార్ట్ కానుంది. ఇక జాసన్ సంజయ్ బాటలోనే పయనిస్తున్నాడు మరో స్టార్ హీరో కుమారుడు.

Also Read : Vijay : జాసన్ విజయ్ తోలి సినిమాకు ముహూర్తం ఫిక్స్

బాలీవుడ్‌ బాద్షా కింగ్ ఖాన్ షారుక్‌ ఖాన్‌ వారసుడు ఆర్యన్‌ ఖాన్‌ సినీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆర్యన్ బాలీవుడ్ పరిచయానికి అంతా సిద్ధమైంది. షారుక్ కొడుకు కూడా దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. అయితే ఆర్యన్ సినిమా ద్వారా కాకుండా తొలి ప్రయత్నంగా వెబ్‌సిరీస్‌ ను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ విషయమై X ఖాతాలో పోస్ట్ చేస్తూ వివరాలు ప్రకటించాడు షారుక్‌. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఈ వెబ్ సిరీస్ ను ‘రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇందుకోసం ‘‘బాలీవుడ్‌లో ఇప్పటివరకూ చూడని, తెరకెక్కించని సరికొత్త వెబ్‌సిరీస్‌ను మీకు అందించబోతున్నాం. 2025లో రిలీజ్ అయ్యే ఈ సిరీస్‌ కు గౌరీఖాన్ నిర్మాతగా వ్యవహారిస్తుండగా ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు ’’ అని ప్రకటించాడు షారుక్. ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ వెబ్ సిరీస్ కు స్టార్ డమ్ అనే పేరును పరిశీలిస్తున్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం.

Show comments