“ఆర్ఆర్ఆర్” బ్యూటీకి షారుఖ్ ప్రామిస్…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“ఆర్ఆర్ఆర్”లో హీరోయిన్ గా నటిస్తున్న అలియా భట్ నిర్మాతగా మారబోతున్న విషయం తెలిసిందే. తాజాగా అలియా నిర్మాతగా తన మొదటి ప్రాజెక్ట్ ‘డార్లింగ్స్’ షూటింగ్ ను ప్రారంభించింది. ఈ చిత్రంలో షెఫాలి షా, విజయ్ వర్మ, రోషన్ మాథ్యూ నటిస్తున్నారు. దీనికి జస్మీత్ కె రీన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అలియా భట్ తన ఎటర్‌నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ పతాకంపై షారుఖ్ ఖాన్ తో కలిసి నటిస్తోంది. ఇక నిర్మాతగా తన మొదటి చిత్రం ప్రారంభమైన సందర్భంగా అలియా ఓ పిక్ ను షేర్ చేస్తూ తన ఫీలింగ్ ను పంచుకుంది. “డార్లింగ్స్‌లో ఒక రోజు! నిర్మాతగా నా మొదటి చిత్రం. కానీ నేను ఎప్పటికీ ముందుగా నటిని అనే చెబుతా… ఈ సినిమా విషయంలో చాలా నెర్వస్ గా ఫీల్ అవుతున్నాను. దీని గురించి రాత్రంతా కలలు కంటూనే ఉన్నాను. సెట్స్ కు నేను ఆలస్యంగా వస్తానేమో అనే భయంతో 15 నిమిషాల ముందుగానే చేరుకున్నాను. కానీ భయం ఉందంటే అర్థం మనం పనిపై శ్రద్ధ వహిస్తున్నట్టే. ఈ నెర్వస్ నెస్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉంటుందేమో” అంటూ ట్వీట్ చేసింది.
Read Also : శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీలో మరో హీరో ?
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
అయితే ఆమె ట్వీట్ పై స్పందించిన బాలీవుడ్ కింగ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఫన్నీగా రిప్లై ఇచ్చారు. “ఈ ప్రాజెక్ట్ తరువాత దయచేసి మీ తదుపరి ప్రొడక్షన్ లో నన్ను కూడా కలుపుకోండి. నేను షూటింగ్ కు సమయానికి వస్తాను. చాలా ప్రొఫెషనల్ గా ఉంటాను. ప్రామిస్! ” అంటూ ట్వీట్ చేశాడు షారుఖ్. “నా ఫేవరేట్ స్టార్ ఇంకేం అడగను… డీల్ ఓకే” అంటూ బదులిచ్చింది అలియా. ప్రస్తుతం వీరిద్దరి ట్విట్టర్ సంభాషణ చర్చనీయాంశంగా మారింది.
- Tags
- Darlings
- Shah Rukh Khan
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!