Shaakuntalam: హృదయానికి హత్తుకునే కథతో.. నవంబర్ 4న శాకుంతలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shaakuntalam is all set to release on November 4: సమంత, దేవ్ మోహన్ జంటగా నటించిన అద్భుత దృశ్య కావ్యం ‘శాకుంతలం’.. ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 4న భారీ విడుదల
ప్రపంచం నలుమూలలున్న పండితుల ప్రశంసలు పొందిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం. దీని ఆధారంగా భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో రసరమ్య దృశ్య కావ్యంగా రూపొందిన చిత్రం ‘శాకుతలం’. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమైంది. శాకుంతలం కోట్లాదిమంది హృదయాలను గెలుచుకున్న శకుంతల, దుష్యంత మహారాజు మధ్య ఉన్న అజరామరమైన ప్రణయగాథ ఇది. శకుంతలగా సమంత.. దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు.
Also Read
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
ఇటీవల ‘శాకుంతలం’ సినిమా ఫస్ట్ పోస్టర్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో సినిమాపై ఉన్న ఆసక్తి మరో లెవల్‌కు చేరుకుంది. పురాణ ప్రణయ గాథను చూడాలని వారెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎపిక్ ఫిల్మ్ మేకర్, డైరెక్టర్ గుణ శేఖర్ కశ్యప కనుమలు (కాశ్మీర్)లో సాగే ఈ ప్రేమ కథను తనదైన మార్క్‌తో అద్భుతంగా ఆవిష్కరించారు. దుష్యంత పురు రాజవంశం యొక్క వైభవాన్ని గ్రాండియర్‌గా, కళ్లు చెదిరేలా అసాధారణంగా తెరకెక్కించారాయన.
హృదయానికి హత్తుకునే కథతో పాటు భారీ తారాగణం ఈ చిత్రంలో నటించారు. సచిన్ ఖేడేకర్, కబీర్ బేడీ, డా.ఎం.మోహన్ బాబు, ప్రకరాష్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిస్సు సేన్ గుప్తా కీలక పాత్రల్లో నటించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువరాజు భరతుడి పాత్రలో నటించటం ప్రధాన ఆకర్షణ కానుంది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై నీలిమ గుణ నిర్మాతగా శాకుంతలం సినిమా రూపొందుతోంది. గుణ శేఖర్ రచన, దర్శకత్వంలో ఆవిష్కృతమవుతోన్న ఈ ప్రేమ కావాన్ని ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 4న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు.
Funds for Bhanzu: ‘ప్రపంచంలోనే ఫాస్ట్ హ్యూమన్ క్యాలికులేటర్’ భాను సంస్థకి రూ.115 కోట్ల ఫండ్స్
తాజావార్తలు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!