Sexual harassment : జగిత్యాల జానీ రైటర్ సుద్దాలపై లైంగిక వేధింపులు కేసు..
- జగిత్యాల లో మరో జానీ మాస్టర్
- అవకాశాల పేరుతో యువతికి లైంగిక వేధింపులు
- పలు మార్లు అత్యాచారం.. పోలీసులకు ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ కళని నమ్ముకుని ఎన్నో కలలు కంటూ సినిమా ఇండస్ట్రీలో రాణించాలని బోలెడన్ని ఆశలుతో వస్తారు. అలా వచ్చే వారి అవసరాన్ని అవకాశం గా మార్చుకుని బెదిరించి, భయపెట్టి తమ లైంగిక వాంఛలు తీర్చుకోవాలనుకునే ప్రబుద్ధులు ఎందరో ఉన్నారు. జాతీయ అవార్డు సైతం అందుకుని కామకోరిక తీర్చనందుకు ఓ యువతిని బెదిరించి అత్యాచారం చేసినందుకు నేడు కటకటాల వెనుక ఊచలు లెక్కేస్తున్నాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.
తాజాగా ఇటివంటి ఉదంతమే జగిత్యాలలో జరిగింది. జగిత్యాలలో మరో జానీ మాస్టర్ తయారయ్యాడు.లేడీ సింగర్ ను లైంగిక వేధింపులు గురిచేశాడు. ఫోక్ సాంగ్స్ రైటర్ సుద్దాల మల్లిక్ తేజ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కు రచనలు చేసాడు. తన రచనల ద్వారా లోకల్ టాలెంట్ ను ప్రోత్సహిస్తూ జగిత్యాలలోని మామిడి మౌనిక అనే యువతికి సింగర్ గా అవకాశం ఇచ్చాడు. వీరి కాంబోలో వచ్చిన అనేక ఫోక్ సాంగ్స్ సూపర్ హిట్ సాదించాయి. దుబాయ్ వంటి ఇతర దేశాల్లోను ఈవెంట్స్ నిర్వహించారు.
Also Read
ఇదిలా ఉండగా సుద్దాల మల్లిక్ తేజపై రేప్ కేసు నమోదు చేసారు జగిత్యాల పోలీసులు. అవకాశాల పేరుతో లైంగిక వేధింపులు గురి చేస్తున్నాడని మల్లిక్ తేజ్ పై సింగర్ మామిడి మౌనిక ఫిర్యాదు చేసింది. తనకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఇంస్టాగ్రామ్ ఐడీలు పాస్వర్డ్ మార్చి, తనను మాసికంగా వేధిస్తున్నాడంటూ జగిత్యాల పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది సింగర్ మౌనిక. అలానే తనను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి, స్టూడియోలో పలుసార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది సింగర్ మౌనిక.
తాజావార్తలు
-
Pradeep Ranganathan: ఆ డైరెక్టర్’తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. ‘బేబీ బాస్’ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
-
Passport Row: పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
-
Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
-
Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!