Satya Dev: ఓఆర్ఆర్ దగ్గర 10 ఎకరాలు కొనొచ్చు’ అని బిల్డప్ ఇచ్చేవారు..డిసపాయింట్మెంట్ నాకు కొత్త కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, A+S మూవీస్, మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్ల మీద చింతా గోపాలకృష్ణా రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించిన చిత్రం ‘రావు బహదూర్’. జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో, వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన ఈ సినిమాలో సత్య దేవ్, దీపా థామస్ జంటగా నటించారు. జూలై 3న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో శనివారం నాడు చిత్రయూనిట్ గ్రాండ్‌గా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ విజయోత్సవ వేడుకలో హీరో సత్యదేవ్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. తన మనసులోని మాటలను ఓపెన్‌గా షేర్ చేసుకున్నారు.
“ఇందాక ఇక్కడ అందరూ మాట్లాడుతుంటే జూలై 4 అనేది నాకు ఒక ‘రీబార్న్’, ‘రీబర్త్’ లాంటిది అంటున్నారు. నిజానికి నా మైండ్‌లో ఏముందో ఇప్పుడు మీకు చెప్తాను. ఎస్పెషల్లీ ఈ ‘రావు బహదూర్’ సినిమా కంటే ముందు నేను చాలా సినిమాలు చేశాను. చాలా సినిమాలకి ఇంతే, అంతకంటే ఎక్కువే కష్టపడ్డాను. ఆ టైమ్‌లో అందరూ ‘రిజల్ట్ అద్భుతంగా వస్తుంది, నువ్వు అసలు ఓఆర్ఆర్ దగ్గర 10 ఎకరాలు కొనొచ్చు’ అని బిల్డప్ ఇచ్చేవారు. తీరా చూస్తే రిజల్ట్ రివర్స్ అయ్యేది. అలా చెప్పిన ప్రతిసారీ నాకు డిసపాయింట్మెంట్ ఎదురయ్యేది. నిజం చెప్పాలంటే డిసపాయింట్మెంట్ నాకు కొత్త కాదు. అది రోజు నా పక్కనే ఉంటుంది, ఇద్దరం కలిసే సహజీవనం చేస్తుంటాం. కానీ నాకు సక్సెస్ అనేది చాలా కొత్త. టెక్నికల్ గా జూలై 3న నాకు ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది అనే పాయింట్ కంటే నాకు ఎక్కువ అనిపించింది ఏంటంటే… ‘అరే, ఒకవేళ జనాలు ఈ సినిమా చూడకపోతే, నా సక్సెస్ సంగతి పక్కన పెడితే, ప్రేక్షకులు ఒక ఇంత గొప్ప సినిమాను మిస్ అయిపోతారు, కోల్పోతారు’ అనే బాధ నాలో ఎక్కువగా ఉండేది.”
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
“ఈ సినిమా ఆడాలి అని నేను అంతలా ఎందుకు స్ట్రైవ్ చేశానంటే, ఇదొక బాధ్యతగా ఫీల్ అయ్యాను. ‘డూ సంథింగ్ విత్ ప్యూర్ హార్ట్, సక్సెస్ విల్ ఫాలో ఫర్ షూర్’ (నిజాయితీతో పని చేస్తే విజయం వస్తుంది) అని నేను బలంగా నమ్ముతాను. ఈ పర్టికులర్ ఫిల్మ్ ఆడితే, రేపు పొద్దున వేరే నిర్మాతలు కథలు వినేటప్పుడు కాఫీలు పక్కన పెట్టి… ‘మళ్ళీ వెంకటేష్ మహా లాంటి ఇంకో దర్శకుడు వస్తాడేమో, అతనూ మహా అవుతాడేమో’ అని నమ్ముతారు. ఆ నమ్మకం మిస్ అవ్వకూడదని నేను బలంగా అనుకున్నాను, ఈరోజు అదే జరిగింది.”
“నేను ఇందాక అన్నట్టు, ఈరోజు యూఎస్‌లో ఉన్న చాలా మంది అమెరికన్స్ ఈ సినిమా చూసి, రియాక్ట్ అవుతూ చేసిన 3, 4 వీడియోలను నాకు ట్యాగ్ చేశారు. వాళ్ళు ‘మేము ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, డెఫినెట్‌గా ఈ సినిమాను రికమెండ్ చేస్తాం’ అంటుంటే చాలా ఆనందం వేసింది. ఆ రోజు నేను ఇదే చెప్తే నన్ను ఏదో అన్నారు [నవ్వుతూ]. కానీ ‘దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్’. రావు బహదూర్ అంటే అది. ఇంతటి గొప్ప విజయాన్ని అందించినందుకు అందరికీ థాంక్స్. నా కెరీర్ లోనే ఫస్ట్ డే ఇంత పెద్ద నెంబర్ (కలెక్షన్స్) రావడం ఇదే తొలిసారి.” మహా ఈ కథ పట్టుకుని వేరు వేరు కెపాసిటీల్లో, వేరు వేరు హీరోల దగ్గరికి వెళ్ళినప్పుడు నేనే మీడియేషన్ చేశాను. ఈ విషయం ఎవరికీ తెలియదు. వేరే హీరోతో ట్రై చేస్తున్నప్పుడు కూడా ‘మీరు అస్సలు మిస్ అవ్వద్దు, మహాతో ఈ సినిమా చేయండి’ అని నేనే రికమెండ్ చేశాను. ఎందుకంటే నేను చేయాలని కాదు, మహా లాంటోడిని సెలబ్రేట్ చేయాలన్నదే ఫస్ట్ నుంచి నా పాయింట్. అలా ఆ కథ తిరిగి తిరిగి నా దగ్గరికే వచ్చింది.” అంటూ సత్యదేవ్ భావోద్వేగంగా ముగించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..