అందాల నటి లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా రొమాంటిక్ కామెడీ చిత్రం ‘సతీ లీలావతి’. సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. దేవ్ మోహన్ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి, మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ విడుదల చేశారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్‌ను..
Also Read : Sandeep Kishan : నితిన్ పక్కకు పెట్టిన ప్రాజెక్ట్‌లోకి యంగ్ హీరో.. !
ఈ రోజు ఉదయం 10:30 గంటలకు విడుదల చేశారు. కాగా ఈ టీజర్లో సోషల్ మీడియా ట్రెండ్స్, కౌంటర్లు, సరదా పంచ్‌లతో కథనాన్ని సాగించడాన్ని చూడొచ్చు. లావణ్య న్యాచురల్ టైమింగ్, దేవ్ మోహన్ కామెడీ టచ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ఫన్ రైడ్‌కు బ్యాక్‌గ్రౌండ్‌లో మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం మరింత ఆకర్షణగా మారింది. ప్రస్తుతం టీజర్‌కు వస్తున్న స్పందన బాగానే ఉంది. చిత్ర బృందం త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. సమకాలీన సెటైర్లు, ఫన్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా యూత్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.