Sarkaru Bayi: తెలంగాణ పల్లె పోరాటం.. బావి చుట్టూ తిరిగే అసలు కథ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో యదార్థ సంఘటనల బ్యాక్‌డ్రాప్‌తో వచ్చే రా అండ్ రస్టిక్ సినిమాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అదే దారిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన కొన్ని మైండ్ బ్లాక్ నిజాల ఆధారంగా తెరకెక్కుతోన్న సరికొత్త పీరియడ్ డ్రామా “సర్కారు బాయి”. హీరో శ్రీరామ్ నిమ్మల, వర్షిక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్పణలో నిర్మాత తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. విలక్షణ దర్శకుడు లారా ఈ చిత్రానికి కథ, దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ రోజు హీరో శ్రీరామ్ నిమ్మల పుట్టినరోజు సందర్భంగా.. ఆయనకు బెస్ట్ విషెస్ చెప్తూ చిత్ర యూనిట్ విడుదల చేసిన స్పెషల్ బర్త్ డే పోస్టర్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే భారీ బజ్ క్రియేట్ చేసిన దర్శకుడు లారా.. ఈ పుట్టినరోజు పోస్టర్లో హీరో క్యారెక్టర్‌ను మరింత ఇంటెన్సివ్‌గా ప్రజెంట్ చేశారు. ఒక తెలంగాణ పల్లెటూరి యువకుడిగా శ్రీరామ్ నిమ్మల లుక్ ఎంతో సహజంగా, కళ్లలో ఒక కసితో కనిపిస్తోంది. అప్పటి తెలంగాణ పల్లెల్లో రాజ్యమేలిన నీటి సమస్యలు, అణగారిన వర్గాల జీవిత పోరాటాలు, సమాజంలో వేళ్లూనుకుపోయిన కుల వివక్ష వంటి అత్యంత సున్నితమైన మరియు సమాజాన్ని ఆలోచింపజేసే అంశాలను ఈ సినిమా ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు. ఒక నటుడిగా శ్రీరామ్ నిమ్మల కెరీర్లో ఈ ‘సర్కారు బాయి’ ఒక మైలురాయిగా నిలిచిపోతుందనే అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
తాజావార్తలు
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
-
Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
-
Harish Rao : కేసీఆర్ పాలనలో పరిష్కారాలు.. రేవంత్ సర్కార్‌లో సమస్యలే
-
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?