Site icon NTV Telugu

Sanjay Dutt: లోకేష్ కనగరాజ్ నన్ను వేస్ట్ చేశాడు!

Sanjay Dutt First Look

Sanjay Dutt First Look

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఈ మధ్యకాలంలో పలు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. అయితే, ఇప్పుడు కన్నడలో అర్జున్ సర్జా మేనల్లుడు ధృవ సర్జా హీరోగా నటించిన ఒక సినిమాలో కీలక పాత్రలో సంజయ్ దత్ నటించాడు. ఆ సినిమా త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న కారణంగా సినిమా టీమ్ గట్టిగా ప్రమోషన్స్ చేస్తోంది. ఈ సినిమా గురించి నిన్న తెలుగు మీడియా ముందుకు వచ్చింది టీమ్ అంతా కలిసి. ఈ సందర్భంగా సంజయ్ దత్‌కు పలు రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి.

Also Read:Junior : ఆసక్తికరంగా జూనియర్ ట్రైలర్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నేను దళపతి విజయ్‌తో కలిసి పని చేశాను. ఆయనతో కలిసి పని చేయడాన్ని చాలా ఇష్టపడ్డాను. కానీ నాకు లోకేష్ కనగరాజ్ మీద కోపం ఉంది. ఎందుకంటే, ఆయన నాకు చాలా చిన్న పాత్ర ఇచ్చాడు. ‘లియో’లో ఒకరకంగా నన్ను వృథా చేశాడు. ఏది ఏమైనా, నేను మాత్రం సినిమా విషయంలో ఎంజాయ్ చేశాను,” అని సంజయ్ దత్ చెప్పుకొచ్చాడు. ‘లియో’ సినిమాలో సంజయ్ దత్ దళపతి విజయ్ బాబాయి పాత్రలో కనిపించాడు. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా పరిమితం. అసలు సంజయ్ దత్ ఇలాంటి సినిమాను ఎలా ఒప్పుకున్నాడని అప్పట్లో అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇప్పుడు బహిరంగంగానే తన అసంతృప్తిని సంజయ్ దత్ బయటపెట్టడం గమనార్హం.

Exit mobile version