Junior : ఆసక్తికరంగా జూనియర్ ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి జూనియర్’ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌లోకి అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. టీజర్‌లో తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో కిరీటి స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఈ యూత్ అండ్ హై-ఎనర్జీ ఎంటర్‌టైనర్ కు రాధా కృష్ణ దర్శకత్వం వహించారు. ప్రతిష్టాత్మక వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మించారు. జూలై 18న రిలీజ్ కానుండటంతో టీం ప్రమోషన్స్ దూకుడు పెంచింది. పాటలు కూడా చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. ఈరోజు దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు.
Also Read:OG : ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్..
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
ఇక ఈ ట్రైలర్ కట్ చూస్తుంటే అభిని తల్లిదండ్రులు చాలా గారభంగా చూసుకుంటారు. తండ్రి అభిని ఎంతో ప్రేమతో చూస్తాడు. ఇక అభి కాలేజ్‌కి వచ్చిన తర్వాత క్లాస్‌మేట్ స్పూర్తిని ప్రేమించేస్తాడు. అప్పటి వరకు అభి జీవితం హ్యాపీగా, ఎలాంటి బాధ్యతలూ లేకుండా సాగుతుంది. కానీ, తన తండ్రి ఊరిలో ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్న తర్వాత జీవితం పూర్తిగా మారుతుంది. దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాలో యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్, రొమాన్స్, మంచి ఎమోషన్స్ అన్నీ అద్భుతంగా బ్లెండ్ చేశారు. ఫాదర్-సన్ ఎమోషనల్ ట్రాక్, జెనీలియా పాత్ర, ఊరి బ్యాక్‌డ్రాప్ ఇవన్నీ కలిపి ఈ సినిమాను ఒక మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌కి నచ్చే కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఫీల్స్ కల్పిస్తున్నాయి.
Also Read:Pooja Hegde : పూజాహెగ్డే ఊపేసింది భయ్యా.. డ్యాన్స్ అదుర్స్..
ఇక కిరీటి రెడ్డి తన తొలి సినిమాతోనే చాలా మెచ్యూర్‌గా, వర్సటైల్‌గా కనిపించే పాత్రను చేయడం విశేషం. శ్రీలీల తన స్క్రీన్ ప్రజెన్స్ తో ఎనర్జీ తీసుకొచ్చారు. వైవా హర్ష, సత్యల కామెడీ టైమింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జెనీలియా ప్రజన్స్ చాలా స్పెషల్ గా వుంది. కిరీటి తండ్రిగా డాక్టర్ రవిచంద్ర వి ఎమోషనల్ డెప్త్ తీసుకొచ్చారు. సినిమాటోగ్రాఫర్ కె.కె. సెన్తిల్ కుమార్ విజువల్స్ కళ్లకు విందుగా, గ్రాండ్‌గా వున్నాయి. డీఎస్పీ సంగీతం ఓ రేంజ్‌లో ఉంది. ప్రతి సీన్‌కి సరిపోయేలా ఎమోషన్స్‌ని పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేశారు. యాక్షన్ ఎపిసోడ్స్‌ను పీటర్ హైన్ అద్భుతంగా డిజైన్ చేశారు. ప్రొడక్షన్ డిజైన్‌కి రవీందర్, ఎడిటింగ్‌ను నిరంజన్ దేవరమనే బెస్ట్ వర్క్ ఇచ్చారు. కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. మొత్తానికి ట్రైలర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ని మరింత పెంచింది. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
-
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
-
Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!