హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసు విచారణ నాంపల్లి కోర్టులో జరిగింది. ఈ విచారణకు ప్రముఖ నటుడు అల్లు అర్జున్ వర్చువల్‌గా హాజరయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో జరిగిన విచారణకు అల్లు అర్జున్ నేరుగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ (వర్చువల్) ద్వారా హాజరై తన వాదనలను వినిపించారు.
ఇరుపక్షాల వాదనలను నమోదు చేసుకున్న న్యాయస్థానం, ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. గతంలో సంధ్య థియేటర్ వద్ద భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో జరిగిన తొక్కిసలాట ఘటన, అనంతరం ఒక మహిళ మరణం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన క్రమంలో నమోదైన కేసులో భాగంగా న్యాయస్థానం ఈ విచారణను చేపట్టింది. అల్లు అర్జున్ ప్రస్తుతానికి రాకా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దీంతో ఆయన ముంబైలోనే మకాం వేసి షూట్ లో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది.
