తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో సందీప్ రెడ్డి వంగా ఒక స్టార్ డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా సినిమా ప్రమోషన్స్ లో తెగ కనిపిస్తున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి వరుస విజయాలతో ఆయన దర్శకుడిగా తన సత్తా చాటారు. అయితే, ఇప్పుడు ఆయన సినిమా ప్రమోషన్స్ లో కూడా తన ప్రభావాన్ని చూపిస్తున్నారు. గతంలో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, బాహుబలి తర్వాత సినిమా ప్రమోషన్స్ లో ఇలానే రచ్చ రేపారు. సినిమా ఈవెంట్‌లకు తరచూ హాజరై, వివిధ ప్రాజెక్ట్‌లకు సపోర్ట్ ఇచ్చారు. అయితే, రాజమౌళి క్రమంగా ఈ ప్రమోషన్స్ తగ్గించుకోవడంతో, ఆ గ్యాప్ ను సందీప్ రెడ్డి వంగా భర్తీ చేస్తున్నారు. ఈ ఏడాది బాలీవుడ్‌లో అతిపెద్ద హిట్‌గా నిలిచిన సైయారా చిత్ర దర్శకుడు మోహిత్ సూరి, సందీప్ రెడ్డి వంగాకు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read:Fahadh Faasil: పుష్ప2 పై సంచలన వ్యాఖ్యలు
వంగా తన సోషల్ మీడియా ద్వారా సైయారాకు మద్దతుగా పోస్ట్ చేయడం వల్ల చిత్రానికి ముందస్తు గుర్తింపు లభించిందని సూరి వెల్లడించారు. వంగాను “నిజమైన సినిమా ఐకాన్”గా అభివర్ణించారు. అంతేకాక సందీప్ రెడ్డి వంగా ఇటీవల పలు ప్రముఖ ప్రమోషన్ ఈవెంట్‌లలో కనిపించారు. నాగ చైతన్య నటించిన తండేల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. అలాగే, విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కోరిక మేరకు వారి రాబోయే చిత్రం కింగ్‌డమ్ కోసం ప్రత్యేక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో ఆయన ప్రభావం క్రమంగా పెరుగుతుండటంతో, సందీప్ రెడ్డి వంగా కేవలం తన చిత్రాలకు మాత్రమే కాకుండా, సినిమాలకు హైప్ పెంచే వ్యక్తిగా కూడా గుర్తింపు పొందుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తా కనుక వంగా తదుపరి దర్శకత్వ చిత్రం స్పిరిట్, ప్రభాస్ ప్రధాన పాత్రలో, ఈ సెప్టెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది.
