Romanchakam: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మనసు దోచిన లవ్ స్టోరీ.. ‘రోమాంచకం’ తో సరికొత్త ప్రయాణం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Romanchakam: ఇండస్ట్రీకి అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ పై సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ప్రతి చిత్రాన్ని ఆయన సోదరుడు, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా. అయితే ఫస్ట్ టైం ఈ సెన్సేషనల్ బ్రదర్స్ ఒక యంగ్ టీమ్‌తో కొత్త సినిమా ప్రొడ్యూస్ చేస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తుంది. సందీప్ లాంటి డైరెక్టర్ సమర్పిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ఇంతకీ ఆ సినిమా పేరు ఏంటో తెలుసా “రోమాంచకం”. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తుండగా, సందీప్ రెడ్డి వంగా ఈ మూవీని సమర్పిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు.
ఈ రోజు “రోమాంచకం” సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్‌ను సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన తన పోస్ట్‌లో ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ‘ఈ సినిమా కథ వింటున్నంత సేపూ నేను హాయిగా నవ్వుకుంటూనే ఉన్నాను. ఫస్ట్ టైం నేను ఒక సినిమాను సమర్పిస్తున్నాను. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ నుంచి ఒక వినూత్నమైన మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఎంటర్టైన్మెంట్ వెనుక ఒక బలమైన ఎమోషనల్ టచ్ కూడా ఉంది. ఎంతోమంది యంగ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న “రోమాంచకం” సినిమా ఒక ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఈ సరికొత్త కథకు సుమంత్ ప్రభాస్, అనంతిక జంట మరింత ఫ్రెష్ నెస్ తీసుకొస్తున్నారు’’ అని ఆయన తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ వెల్లడించనున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్ విషయానికి వస్తే.. లవ్, ఫన్, బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఉన్న ఒక ఫ్రెష్ ఎంటర్ టైనర్ అనే ఇంప్రెషన్ టైటిల్ పోస్టర్‌తో కలుగుతోంది.
Also Read
- Kareena - Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
- Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
I had a heartfelt laugh throughout the narration. Beneath all the fun, there’s a strong emotional tact, and for the first time, I’m presenting the film.
Glad to announce that BHADRAKALI PICTURES is coming out with a very unique musical romantic comedy.#Romanchakam… pic.twitter.com/DpYHUVRYlK— Sandeep Reddy Vanga (@imvangasandeep) May 29, 2026
తాజావార్తలు
-
Kareena – Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
-
Honor X9e Pro: 11,000mAh బ్యాటరీతో హానర్ X9e ప్రో 5G లాంచ్.. 10,000 నిట్స్ డిస్ప్లే, 108MP కెమెరా
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ
-
TN SESHAN: రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒక్క మొనగాడు..! శేషన్ ఇప్పుడు ఉండి ఉంటేనా..!
-
Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
ట్రెండింగ్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!