ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి. ఇంకా సినిమా షూటింగ్ కూడా మొదలు కాలేదు కానీ, ఈ సినిమా మీద జరిగినన్ని ప్రచారాలు ఇప్పటివరకు మరే సినిమాకి జరిగి ఉండకపోవచ్చు. తాజాగా సందీప్ రెడ్డి వంగా ‘జిగ్రీస్’ అనే ఒక చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి ఈ సినిమాకి ఆయన సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఒకటి ఈ సందీప్ రెడ్డి వంగా చేశారు. ఈ నేపథ్యంలో ‘స్పిరిట్’ సినిమా గురించి కూడా ఆయన స్పందించారు.
Also Read :RGV : శివ’లో నాగార్జున కూతురికి క్షమాపణలు చెప్పిన రామ్ గోపాల్ వర్మ
‘స్పిరిట్’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించిన వార్తలు నిజం కాదని ఆయన తోసిపుచ్చారు. అయితే డాన్ లీ అనే ఒక కొరియన్ యాక్టర్ గురించి అడిగినప్పుడు మాత్రం ఆయన దాన్ని ఖండించకుండా, “ఇస్తా, ఒక అప్‌డేట్ ఇస్తా” అంటూ కామెంట్ చేయడం గమనార్హం. ఈ లెక్కన చూసుకుంటే ఆయన డాన్ లీతో ఈ సినిమాలో నటింప చేస్తున్నారని చెప్పొచ్చు. నిజానికి అతనికి కొరియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజీ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో ఆయన కూడా నటిస్తున్నాడని తేలడంతో, ప్రభాస్ సినిమా ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్‌తో రిలీజ్ కావడం ఖాయం అనే వాదన వినిపిస్తోంది. మరి చూడాలి, ఇందులో ఎంతవరకు నిజమవుతుంది అనేది.