కరోనా సెకండ్ వేవ్ కలకలం సృష్టిస్తోంది. ఎంతో జాగ్రత్తగా ఉండే సెలెబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బాలీవుడ్ నటి సమీరారెడ్డి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్టు సమీరా తెలిపింది. దీంతో ఆమె అభిమానులు సమీరా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఆమె కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా పిల్లలకు కూడా కరోనా సోకిందా ? అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమీరా రెడ్డి తన పిల్లలకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యిందని తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన పిల్లలు హన్స్, నైరా అస్వస్థతకు లోనయ్యారని, నాలుగు రోజుల క్రితం కరోనా టెస్ట్ చేయించగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని, ఆ సమయంలో తనకు చాలా భయమేసిందని తెలుపుతూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది సమీరా. అందరూ కరోనాను నిర్లక్ష్యం చేయకుండా… జాగ్రత్తగా ఉండాలని కోరింది.
https://www.instagram.com/p/CN1PAZJHxeI/?utm_source=ig_embed