Site icon NTV Telugu

Maa Inti Bangaram: ‘మా ఇంటి బంగారం’ కోసం నందిని రెడ్డి

Samantha

Samantha

మయోసైటిస్ బారిన పడి, కోరుకున్న సమంత సినిమాల విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉంటుంది. నిర్మాతగా మారి, శుభం సినిమా చేసిన ఆమె దాంతో కమర్షియల్‌గా బాగానే సంపాదించింది. ఇక ఇప్పుడు ఆమె నుంచి ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని గతంలోనే చాలా కాలం క్రితం ప్రకటించారు. ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నారని అప్పట్లో ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఆ కొత్త దర్శకుడి స్థానంలో సమంత స్నేహితురాలైన దర్శకురాలు నందిని రెడ్డి ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది.

Also Read:Coolie : ‘కూలీ’లో పాత్ర అన్యాయం అంటూ ప్రచారం.. స్పందించిన శృతిహాసన్..

వీరిద్దరూ కలిసి గతంలో ‘ఓ బేబీ’ లాంటి హిట్ అందుకున్నారు. అయితే, అంతకుముందు చేసిన ‘జబర్దస్త్’ అనే సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతానికి నందిని రెడ్డి ట్రాక్ రికార్డు కూడా అంత పర్ఫెక్ట్‌గా ఏమీ లేదు. మరోపక్క, సమంతది కూడా అదే పరిస్థితి. ఆమె చేస్తున్న సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. నిర్మాతగా మారిన తర్వాత బ్రేక్ తీసుకున్న ఆమె, ఇప్పుడు ఈ సినిమా మొదలుపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా 80లలో సెట్ చేయబడిన ఒక క్రైమ్ త్రిల్లర్ అని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి నందిని రెడ్డి ఎంట్రీ తర్వాత మళ్లీ రీస్క్రిప్ట్ జరుగుతోంది. సమంత తన సొంత ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సినిమాని నిర్మించబోతోంది. ఈ మధ్యకాలంలో ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ, తాను ఇకమీదట ఎక్కువ సినిమాలు కాదు, మంచివి తక్కువ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది.

Exit mobile version