ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఏఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనె, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ కు సంబంధించిన సన్నివేశాల షూటింగ్ జరుగుతోంది. ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ నటిస్తోందన్న వార్త సంచలనంగా మారింది.
Read Also : రెండవ పెళ్ళికి సిద్ధమైన సుమంత్
ప్రభాస్ సరసన నటించడానికి హీరోయిన్ గా దీపికా పదుకొనెను మేకర్స్ తీసుకున్నప్పటికీ సినిమాలో మరో హీరోయిన్ పాత్రకు కూడా ఆస్కారం ఉందట. ఆ పాత్రలో సమంతను తీసుకోబోతున్నారని టాక్. సమంత కూడా ప్రభాస్ తో కలిసి నటించడానికి ఉత్సాహంగా ఉందట. ప్రభాస్ ప్రస్తుతం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ‘రాధే శ్యామ్’లో నటిస్తున్నాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు సమంత అక్కినేని గుణశేఖర్ “శాకుంతలం”లో నటిస్తోంది. తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన “కాతు వాకులా రేండు కాదల్”లో కనిపించనుంది. ఇందులో విజయ్ సేతుపతి, నయనతార కూడా ప్రధాన పాత్రల్లో నటించారు.