పారితోషికం .. ఈ విషయం పై ఇప్పటికే చాలా మంది నటీనటులు వారి అభిప్రాయాలను, బాధను ఒక్కొక్కరు ఒక్కోలా పంచుకున్నారు. ఇక తాజాగా స్టార్ హీరోయిన్ సమంత కూడా ఈ విషయంపై స్పందించింది. ఇటివల అనారోగ్యం నుండి కొంత కోలుకుంటున్నా సామ్ కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ఇటు నిర్మాతగా కూడా మారి మంచి కథలు అందించే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు సోషల్ మీడియాలో, ఇంటర్వ్యూ లో పాల్గొంటు సమంత చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఈ అమ్మడు రెమ్యూనరేషన్స్ మీద వైరల్ కామెంట్స్ చేసింది..
Also Read: Taapsee : పేదల పట్ల గొప్ప మనసు చాటుకున్న తాప్సీ..
సామ్ మాట్లాడుతూ.. ‘నా కెరీర్ లో నేను ఇప్పటికి ఎన్నో సినిమాల్లో నటించాను. నటీనటులందరూ ఒకేలా కష్టపడతారు కానీ, వారికి ఇచ్చే పారితోషికాల్లో మాత్రం వ్యత్యాసం ఉంటుంది. సమానమైన డిమాండ్ ఉన్న పాత్రలు చేసినప్పటికీ కూడా, పారితోషికం విషయంలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. పరిశ్రమలో నన్ను ఇబ్బంది పెట్టే విషయంలో ఇది ఒకటి. అందుకే నేను దీన్ని పునరావృతం చేయకూడదని భావిస్తున్నా. ఈ విషయంలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నా. గత పరిస్థితులు నేను మార్చలేదు. కాబట్టి నేను ప్రత్యక్షంగా కాకపోయినా ఈ విషయంపై పోరాడుతున్నాను. అలాగని సమానంగా పారితోషికం ఇవ్వాలని నేను కోరడం లేదు. అది న్యాయం కాదు కూడా. కానీ కష్టాన్ని చూసి రెమ్యునరేషన్ ఇవ్వాలని నా బాధ’ అని చెప్పుకొచ్చింది సామ్..