Site icon NTV Telugu

Samantha: సమంత పట్టుకున్న ‘ఆ’ చేయి రాజ్ దేనా?

Raj Nidimoru

Raj Nidimoru

మయోసైటిస్ మరియు పడి కోలుకున్న సమంత, ప్రస్తుతానికి సినిమాలేవీ పెద్దగా చేయడం లేదు. మీరు మాతృగా శుభం అనే సినిమా చేసిన ఆమె, ప్రస్తుతానికి సిటాడెల్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్‌లో ఉందని ప్రచారం ఉంది. అయితే, వీరిద్దరూ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు, అలాగే ఖండించలేదు. అయితే, మంగళవారం నాడు సమంత దుబాయ్ ట్రిప్ నుంచి ఒక వీడియో షేర్ చేసింది. అయితే, అక్కడ రాజ్ నిడిమోరు ఫేస్ కనిపించడం లేదు, కానీ చాలామంది అది రాజ్ నిడిమోరే అని కామెంట్ చేస్తున్నారు.

Also Read:Krish Jagarlamudi: హరిహర వీరమల్లు సెకండ్ పార్ట్ కోసం 40 నిమిషాల ఫుటేజ్ రెడీ.. క్రిష్ రివీల్ చేసేశాడుగా!

వీడియోకి సమంత, “నేనేం చూస్తున్నాను, మీరేం చూస్తున్నారు?” “దుబాయ్ ఫర్ ఎ మినిట్” అని కూడా క్యాప్షన్ పెట్టింది. వెంటనే అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజ్ నిడిమోరు, సమంత డేటింగ్ చేస్తున్నారని చాలాకాలం నుంచి ప్రచారం జరుగుతోంది. దానికి ఓటు ఇచ్చే విధంగా ఫిబ్రవరి ఒకటో తేదీన వరల్డ్ పికిల్‌బాల్ లీగ్ మ్యాచ్ సందర్భంగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఇక మొత్తం మీద, ఈ దుబాయ్ ట్రిప్‌లో కూడా సమంతతో ఉన్నది రాజ్ నిడిమోరే అని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయాన్ని ఆమె క్లారిటీ ఇస్తే తప్ప, ఈ ప్రచారాలకు బ్రేక్ పడే అవకాశం లేదు.

Exit mobile version