ఉర్ఫి జావేద్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.నిత్యం డిఫరెంట్ స్టైల్ డ్రెస్ లో కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది.నేటి యూత్ కు సరికొత్త ఫ్యాషన్ నేర్పుతుంది.డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లలో కనిపిస్తూ నిత్యం వార్తలలో నిలుస్తుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్రెండి వేర్ తో నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది.బాలీవుడ్ బిగ్ బాస్ షో తో ఎంతో పాపులర్ అయిన ఉర్ఫీ తన డ్రెస్సింగ్ స్టైల్ తో విమర్శలు ఎదుర్కొంటుంది. . కానీ అలాంటి విమర్శలు పట్టించుకోకుండా నిత్యం వెరైటీ డ్రెస్సింగ్ స్టైల్ తో నెటిజన్స్ ఆకట్టుకుంటుంది.
ఈ భామ మామూలుగానే తన డ్రెస్సింగ్ స్టైల్ తో అందరిని ఆకర్షిస్తుంది.ఇక మూవీ ఈవెంట్స్, అవార్డ్ వేడుకలలో అయితే చెప్పనక్కర్లేదు.సరికొత్త లుక్ లో కనిపించి సందడి చేస్తుంటుంది.కానీ ఈసారి మాత్రం నెటిజన్స్ ఉర్ఫీ డ్రెస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.మొదటిసారి ఉర్ఫీ డ్రెస్సింగ్ పై సెలబ్రెటీలు సైతం పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.ఇటీవల ఓ ఈవెంట్లో ఉర్ఫీ రంగు రంగుల సీతాకోకచిలుకలతో అలరించిన మ్యాజికల్ బ్లాక్ గౌను ధరించింది. ఉర్ఫీ సరికొత్త డ్రెస్ చూసి అందరు ఆశ్చర్యపోయారు. ఉర్ఫీ డ్రెస్సింగ్ స్టైల్ పై హీరోయిన్ సమంత రియాక్ట్ అయింది.బ్యూటీఫుల్ ఉర్ఫీ అని కామెంట్ చేస్తూ ఆ వీడియోను నెట్టింట పోస్ట్ చేసింది. అలాగే హార్ట్ ఎమోజీలను కూడా షేర్ చేసింది.ప్రస్తుతం ఉర్ఫీ బ్లాక్ మ్యాజికల్ బట్టర్ ఫ్లై గౌను వీడియో నెట్టింట బాగా వైరలవుతుంది.