Samantha: హీరో మాత్రమే కాదు.. ఆయనొక రియల్ లీడర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిల్వర్ స్క్రీన్ మీద తన నటనతో, స్టైల్‌తో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ‘ఇళయదళపతి’ విజయ్, ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా సరికొత్త రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సినీ గ్లామర్‌ను పక్కన పెట్టి, ప్రజాసేవలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్న సీఎం విజయ్ను తాజాగా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు చెన్నైలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ భేటీ అనంతరం విజయ్ రాజకీయ ప్రవేశం, ఆయన వ్యక్తిత్వంపై సమంత తన సోషల్ మీడియా వేదికగా చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర సంచలనంగా మారాయి. చెన్నైలో అడుగుపెట్టగానే తనలో ఒక తెలియని సంతోషం, ఉత్సాహం వెల్లివిరిసిందని సమంత పేర్కొన్నారు. దానికి కారణం ముఖ్యమంత్రిని కలవబోతుండటమేనని స్పష్టం చేశారు.
“విజయ్ సర్ ఎప్పుడూ కేవలం వెండితెరకే పరిమితమయ్యే సాధారణ హీరో కాదు. ఆయనలో ఉండే ఎనర్జీ, ఆయనకున్న పబ్లిక్ ప్రెజెన్స్, ప్రజలు ఆయనకు ఇచ్చే రెస్పాన్స్ చూస్తే.. ఆయన ఎప్పుడూ ఏదో ఒక పెద్ద స్థానానికి, అంతకంటే గొప్ప విషయాల కోసమే పుట్టారని నాకనిపిస్తూ ఉంటుంది” అని సమంత కొనియాడారు. “మనం ఇప్పటికే ఏ రంగంలోనైతే నైపుణ్యం సాధించి, సుస్థిర స్థానంలో ఉన్నామో.. దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి, రిస్క్ ఎక్కువగా ఉండే సరికొత్త రంగంలోకి అడుగుపెట్టడానికి ఎంతో ధైర్యం కావాలి. అది కూడా ఏదో సులువుగా సాధించవచ్చని కాదు, కచ్చితంగా సమాజంలో ఒక మార్పు తీసుకురాగలననే నమ్మకంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన చూపించిన ఆ ధైర్యమే నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేసింది” అని సమంత రాసుకొచ్చారు. మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో సమాజం కోసం, తోటి వారి కోసం ఏదైనా చేయాలనే పిలుపు ప్రతి ఒక్కరికీ వస్తుందని, కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఆ పిలుపునకు స్పందించి ముందడుగు వేస్తారని సమంత అన్నారు.
Also Read
- The Revolutionaries OTT: బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించిన నలుగురు వీరులు.. ఓటీటీలోకి హై-వోల్టేజ్ పీరియడ్ యాక్షన్ సిరీస్
- Irumudi Censor : మాస్ మహారాజా రవితేజ 'ఇరుముడి' సెన్సార్ రిపోర్ట్.. రన్ టైమ్ ఎంతంటే?
- Sigma Release Date: సందీప్ కిషన్ ‘సిగ్మా’ రిలీజ్ డేట్ అనౌన్స్ .. విజయ్ తనయుడి డైరెక్షన్ మూవీ ఎప్పుడంటే?
- Shiva Nirvana: మాకు ముందే తెలుసు.. 'మల్లెపూల పల్లకి' సాంగ్ విమర్శలపై స్పందించిన దర్శకుడు.!
సీఎం విజయ్ గురించి ప్రస్తావిస్తూ.. “ఆయన ఇప్పుడు ఉన్న పదవిని బట్టి కాదు, ఏ మంచి సంకల్పంతో అయితే ప్రజల్లోకి వచ్చారో, ఆ ఆశయమే రేపటి రోజున ఆయనను అమితంగా నమ్మే అభిమానులను సైతం ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. ఆయనకు ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొనే మానసిక శక్తి, వివేకం, ధైర్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని ఆకాంక్షించారు. చివరగా యువతకు ఒక మంచి సందేశాన్ని ఇస్తూ.. మనం మొదట్లో కనే చిన్న చిన్న కలల కంటే.. మన జీవితం చాలా పెద్దదని, సమాజానికి ఉపయోగపడేలా జీవించడమే అసలైన విజయం అని సమంత తన సుదీర్ఘమైన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం సమంత చేసిన ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తెగ వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
The Revolutionaries OTT: బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించిన నలుగురు వీరులు.. ఓటీటీలోకి హై-వోల్టేజ్ పీరియడ్ యాక్షన్ సిరీస్
-
Irumudi Censor : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ సెన్సార్ రిపోర్ట్.. రన్ టైమ్ ఎంతంటే?
-
Adulterated Ghee: పాడైపోయిన క్రీమ్‌తో నెయ్యి దందా.. 25 టన్నుల నకిలీ నెయ్యి పట్టివేత..
-
Bhatti Vikramarka: పెట్టుబడిదారులకు స్వర్గధామం తెలంగాణ.. క్లీన్ ఎనర్జీ మ్యానుఫాక్చరింగ్ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం.!
ట్రెండింగ్
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!