Samantha: హీరో మాత్రమే కాదు.. ఆయనొక రియల్ లీడర్!

Vijay Samantha

Vijay Samantha

సిల్వర్ స్క్రీన్ మీద తన నటనతో, స్టైల్‌తో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ‘ఇళయదళపతి’ విజయ్, ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా సరికొత్త రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సినీ గ్లామర్‌ను పక్కన పెట్టి, ప్రజాసేవలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్న సీఎం విజయ్‌ను తాజాగా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు చెన్నైలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ భేటీ అనంతరం విజయ్ రాజకీయ ప్రవేశం, ఆయన వ్యక్తిత్వంపై సమంత తన సోషల్ మీడియా వేదికగా చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర సంచలనంగా మారాయి. చెన్నైలో అడుగుపెట్టగానే తనలో ఒక తెలియని సంతోషం, ఉత్సాహం వెల్లివిరిసిందని సమంత పేర్కొన్నారు. దానికి కారణం ముఖ్యమంత్రిని కలవబోతుండటమేనని స్పష్టం చేశారు.

“విజయ్ సర్ ఎప్పుడూ కేవలం వెండితెరకే పరిమితమయ్యే సాధారణ హీరో కాదు. ఆయనలో ఉండే ఎనర్జీ, ఆయనకున్న పబ్లిక్ ప్రెజెన్స్, ప్రజలు ఆయనకు ఇచ్చే రెస్పాన్స్ చూస్తే.. ఆయన ఎప్పుడూ ఏదో ఒక పెద్ద స్థానానికి, అంతకంటే గొప్ప విషయాల కోసమే పుట్టారని నాకనిపిస్తూ ఉంటుంది” అని సమంత కొనియాడారు. “మనం ఇప్పటికే ఏ రంగంలోనైతే నైపుణ్యం సాధించి, సుస్థిర స్థానంలో ఉన్నామో.. దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి, రిస్క్ ఎక్కువగా ఉండే సరికొత్త రంగంలోకి అడుగుపెట్టడానికి ఎంతో ధైర్యం కావాలి. అది కూడా ఏదో సులువుగా సాధించవచ్చని కాదు, కచ్చితంగా సమాజంలో ఒక మార్పు తీసుకురాగలననే నమ్మకంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన చూపించిన ఆ ధైర్యమే నన్ను ఎంతగానో ఇన్స్‌పైర్ చేసింది” అని సమంత రాసుకొచ్చారు. మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో సమాజం కోసం, తోటి వారి కోసం ఏదైనా చేయాలనే పిలుపు ప్రతి ఒక్కరికీ వస్తుందని, కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఆ పిలుపునకు స్పందించి ముందడుగు వేస్తారని సమంత అన్నారు.

×
×
Ad

సీఎం విజయ్ గురించి ప్రస్తావిస్తూ.. “ఆయన ఇప్పుడు ఉన్న పదవిని బట్టి కాదు, ఏ మంచి సంకల్పంతో అయితే ప్రజల్లోకి వచ్చారో, ఆ ఆశయమే రేపటి రోజున ఆయనను అమితంగా నమ్మే అభిమానులను సైతం ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. ఆయనకు ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొనే మానసిక శక్తి, వివేకం, ధైర్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని ఆకాంక్షించారు. చివరగా యువతకు ఒక మంచి సందేశాన్ని ఇస్తూ.. మనం మొదట్లో కనే చిన్న చిన్న కలల కంటే.. మన జీవితం చాలా పెద్దదని, సమాజానికి ఉపయోగపడేలా జీవించడమే అసలైన విజయం అని సమంత తన సుదీర్ఘమైన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం సమంత చేసిన ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తెగ వైరల్ అవుతున్నాయి.