సమంత మంచి నటి మాత్రమే కాదు గుడ్ హ్యూమన్ బీయింగ్ కూడా. స్టార్ హీరోయిన్ స్థాయికి చేరకముందు నుండే సమంత తన వంతు సాయం ఆపన్నులకు అందిస్తూ వస్తోంది. సినిమాలలో నటిస్తూనే వాణిజ్య ప్రకటనల్లోనూ మెరుస్తుంటుంది. అంతేకాదు… తన కిష్టమైన ఫ్యాషన్ డిజైన్ రంగంలోకీ అడుగుపెట్టింది. ఆర్గానిక్ ఫార్మింగ్ మీద కరోనా టైమ్ లో దృష్టి పెట్టింది. ఏ పని చేసినా నూరు శాతం ఇన్ వాల్వ్ అవ్వడం సమంతకు అలవాటు. ఈ మధ్య కాలంలో ఇంత వర్సిటాలిటీ ఉన్న హీరోయిన్ ను చూడలేదనిపిస్తుంది. అందుకే సమంత అంటే తోటి హీరోయిన్లకూ ఎంతో అభిమానం. రేపు సమంత పుట్టిన రోజును పురస్కరించుకుని ఆమె కామన్ డీపీని మిల్కీ బ్యూటీ తమన్నా ట్వీట్ చేసింది. అంతే… పలువురు కథానాయికలూ ఆ సీడీపీని ట్వీట్ చేయడం మొదలెట్టారు. తమిళంలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సమంత, కొంత గ్యాప్ తీసుకుని తెలుగులో ‘శాకుంతలమ్’లో నటిస్తోంది. ఈ పాన్ ఇండియన్ మూవీని గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు.