సౌత్ లో మోస్ట్ అడోరబుల్ కపుల్స్ లో సమంత, నాగ చైతన్య జంట ఒకటి. తాజాగా వీరిద్దరికీ సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సామ్-చై ఇద్దరూ కలిసి సినిమాల్లోనే కాకుండా పలు కమర్షియల్ యాడ్ లలో కూడా పని చేస్తారు. తాజాగా వీరిద్దరూ కలిసి ఓ యాడ్ కోసం షూటింగ్ చేయగా… దానికి సంబంధించిన పిక్స్ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఆ యాడ్ లో సాంప్రదాయ దుస్తులు ధరించిన సామ్-చై లుక్ అదిరిపోయింది. సమంత వెండి, గులాబీ రంగు గల పట్టు చీరను, టెంపుల్ జ్యూవెలరీ ధరించగా, నాగ చైతన్య లేత నీలం రంగు సూట్ లో మెరిసిపోయాడు. హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో ఈ యాడ్ షూట్ జరగగా… అందుకు సంబంధించిన పిక్స్, వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది సమంత. కాగా సమంత, నాగ చైతన్య 2010 లో విడుదలైన గౌతమ్ మీనన్ ‘ఏ మాయ చేసావె’ సినిమాలో మొదటిసారిగా నటించారు. ఆ తరువాత ఆటోనగర్ సూర్య, మజిలీ చిత్రాల్లో జంటగా నటించారు.