Site icon NTV Telugu

sai Pallavi : తండేల్ తర్వాత కనిపించని సాయి పల్లవి.. అసలేం చేస్తుంది?

Sai Pallavi

Sai Pallavi

భానుమతి ఒక్కటే పీస్ అంటూ ఫిదాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన తమిళ పొన్ను సాయి పల్లవి యునిక్ పర్సనాలిటీ వల్ల కెరీర్ స్టార్టింగ్‌లో యారగెంట్ హీరోయిన్ అన్న ముద్ర వేయించుకుంది. కానీ తర్వాత తర్వాత సో ఇన్నోసెంట్ గర్ల్ అని తేలిపోయింది. అభినయం, డాన్స్ మూమెంట్స్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువై టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. నెక్ట్స్ బాలీవుడ్‌లోకి స్టెప్ ఇన్ కాబోతుంది ఈ బుజ్జితల్లి  అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న మేరీ రహోతో బాలీవుడ్ డెబ్యూకి రెడీ అవుతోంది సాయి పల్లవి. తొలుత ఏక్ దిన్ టైటిల్‌తో సెట్స్‌పైకి వెళ్లిన ఈ రొమాంటిక్ డ్రామాను నవంబర్ 7న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత టైటిల్ ను మేరీ రహోగా ఛేంజ్ చేసి డిసెంబర్ 12న విడుదల చేస్తామని ఎనౌన్స్ చేశారు.

Also Read : NBK : అఖండ 2 ఓవర్సీస్ రైట్స్ డీల్ వివరాలు. బాలయ్య కెరీర్ హయ్యెస్ట్

కానీ ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ లేదు. కనీసం హీరో హీరోయిన్ల లుక్స్ కానీ ఇతర విషయాలు బయటకు రాలేదు. సినిమా రిలీజ్ కావడానికి ఇంకా నెల రోజులు కూడా లేదు.ప్రమోషన్లనే స్టార్ట్ చేయలేదు టీం. దీంతో ఈ ఏడాది సినిమా వస్తుందా అన్నడౌట్ బీటౌన్ ఆడియన్స్‌లో కలుగుతోంది. ఈ సినిమాతో తానేంటో ఫ్రూవ్ చేసుకోవాల్సిన సమయం. అలాగే ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కనివిని ఎరుగని భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోన్న రామాయణ రెండు భాగాల్లో సీతగా నటించబోతుంది సాయి పల్లవి. ఇప్పటికే రాముడు, సీత గెటప్పుల్లో ఉన్న రణబీర్, పల్లవి ఫోటోలు లీకై మంచి అప్లాజ్ తెచ్చుకున్నాయి. ఈ దీపావళికి పార్ట్ వన్ రిలీజ్ అవుతుందని ఓ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. కానీ మేరీ రహోలో నిషా క్యారెక్టర్ చేసిన న్యాచురల్ బ్యూటీ లుక్ ఎలా ఉందో మచ్చుకైన రివీల్ చేయలేదు టీం. మరి మేరీ రహో చెప్పి టైంకే వస్తుందో లేదో చూడాలి.

Exit mobile version