Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!

Sai Durgha Tej Pawan Kalyan

Sai Durgha Tej Pawan Kalyan

Sai Durgha Tej React on Movie With Pawan Kalyan: మెగా హీరో సాయి దుర్గా తేజ్‌ హీరోగా రోహిత్‌.కేపీ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సంబరాల ఏటి గట్టు’. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి సరసన ఐశ్వర్య లక్ష్మి నటిస్తుండగా.. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న సంబరాల ఏటి గట్టు సినిమా విడుదల కానుంది. నేడు సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ పుట్టిన రోజు. తన పుట్టినరోజు సందర్భంగా FNCCలో అభిమానులతో హీరో సాయి ముచ్చటించాడు.

సంబరాల ఏటి గట్టు తరువాత మంచి రూరల్ బ్యాక్‌డ్రాప్ (గ్రామీణ నేపథ్యం)లో సినిమా చేస్తాను అని అభిమానులతో సాయి దుర్గా తేజ్‌ చెప్పాడు. ఆరు ఫ్లాప్స్ తర్వాత హిట్ రాకపోతే వేరే హీరో ఫ్యాన్స్ మాత్రమే కాదు తన ఫ్యాన్స్ కూడా ఊరుకోరని.. అందుకే మంచి రూరల్ బ్యాక్‌డ్రాప్ చేస్తానన్నాడు. ‘బ్రో’ తర్వాత నా సినిమా వచ్చి చాలా లేట్ అయ్యిందని, సంబరాల ఏటి గట్టుతో సంక్రాంతికి వస్తున్నా డోంట్ వర్రీ అంటూ అభిమానులతో సాయి దుర్గా తేజ్‌ సరదాగా అన్నాడు.

మామ పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు? అని ఓ అభిమాని అడగ్గా.. సాయి దుర్గా తేజ్‌ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ‘నేను కళ్యాణ్ మామతో సినిమా ఎప్పుడూ చేస్తాను అని అడుగుతున్నావా బ్రో. నేను బ్రో అనే సినిమా ఆల్రెడీ చేశా. బ్రో మీరు చూడకపోతే వెళ్లి ఓటీటీలో చూడండి. అయినా తప్పు మాదే. బ్రో సినిమాకు మును సరిగ్గా ప్రమోట్ చెయ్యలేదు అప్పుడు’ అని సాయి చెప్పుకొచ్చాడు. సాయి తేజ్‌ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.