Kalki 2898 AD: కల్కి సినిమాలో మొత్తం ఎంతమంది డైరెక్టర్లు కనిపించారో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
5 Directors Acted in Kalki 2898 AD Movie: కల్కి కల్కి కల్కి ఇప్పుడు ఎక్కడ విన్న ఇదే పేరు వినిపిస్తోంది. ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ఈ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వినిదత్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలను రెట్టింపు చేశాయి. సినిమాలో అనేకమంది నటీనటులు గెస్ట్ రోల్స్ చేశారని ప్రచారం జరుగుతూ రావడంతో సినిమా ఎలా ఉండబోతుందా? అని అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. అయితే ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సినిమాలో చాలామంది నటీనటులతో పాటు దర్శకులు కూడా అతిధి పాత్రలలో కనిపించారు. ఆ దర్శకులు ఎవరు? అనే విషయం మీద ఒకసారి లుక్కు వేద్దాం. ఈ సినిమాలో రాజమౌళి ఒక చిన్న పాత్రలో కనిపించాడు.
Kalki 2898 AD: కల్కి సినిమాలో మొత్తం ఎంతమంది హీరోయిన్లో తెలుసా?
Also Read
భైరవ పాత్రలో కనిపించే ప్రభాస్‌తో పోటీపడే సాటి బౌంటీ హంటర్ గా రాజమౌళి కనిపించాడు. వీరిద్దరి మధ్య కొన్ని సంభాషణలు కూడా పెట్టడం గమనార్హం. ఇక మరో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చింటూ అనే ఒక చిన్నపాటి హోటల్ నడిపే వ్యక్తి పాత్రలో కనిపించాడు. ఇక వారు మాత్రమే కాకుండా జాతి రత్నాలు డైరెక్టర్ కె వి అనుదీప్ కూడా ఒక చిన్న షాట్లో మెరిశాడు. అలాగే మరోదర్శకుడు కం నటుడు శ్రీనివాస్ అవసరాల కూడా ఈ సినిమాలో కనిపించడం గమనార్హం. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన కమల్ హాసన్ కూడా పలు సినిమాలను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాబట్టి ఆయన్ని కూడా ఈ సినిమాలో నటించిన డైరెక్టర్ జాబితాలో వేయొచ్చు. ఇక మొత్తంగా ఈ సినిమాలో మొత్తం ఐదుగురు దర్శకులు కనిపించారు అన్నమాట.
తాజావార్తలు
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
-
Rahul Gandhi: మోడీ విదేశీ టూర్లపై రాహుల్ గాంధీ విసుర్లు
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!