Site icon NTV Telugu

Coolie : కూలీ క్లైమాక్స్ లో రోలెక్స్.. కానీ సూర్య కాదు..

Coolie

Coolie

తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. తమిళ టాప్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ లో దూసుకెళ్తోంది కూలీ. అటు అడ్వాన్స్ బుకింగ్స్ లోను కూలీ మాస్ ర్యాంపేజ్ చూపిస్తోంది.

Also Read : Tollywood Bundh : టాలీవుడ్ లో9వ రోజుకు చేరుకున్న షూటింగ్స్ బంద్

కాగా ఈ సినిమాలో ఆడియెన్స్ ను సప్రైజ్ చేసేందుకు చాలా పకడ్బందిగా ప్లాంక్ చెసాడట లోకేష్ కనకరాజ్. అనేక మంది స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాలో మరొక స్టార్ కమల్ హాసన్ కూడా నటిస్తున్నాడు అనే టాక్ ఆయితే వినిపిస్తుంది. ఇక ఇప్పుడు మరొక క్రేజి అప్డేట్ ఈ సినిమా నుండి వినిపిస్తోంది. లోకేష్ డైరెక్షన్ లో వచ్చిన విక్రమ్ సినిమాలో క్లైమాక్స్ లో క్యామియో లో వచ్చిన రోలెక్స్ క్యారక్టర్ ఆడియెన్స్ కు గూస్ భమ్స్ తెప్పించింది. రోలెక్స్ పాత్రలో నటించిన సూర్య అద్భుతమైన పర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. ఇప్పడు అటువంటిదే కూలీలో కూడా ప్లాన్ చేసాడట లోకేష్. కూలీ సినిమా క్లైమాక్స్ లో రోలెక్స్ కనిపించబోతున్నాడట. అయితే ఈ రోలెక్స్ లో పాత్రలో సూర్య నటించడం లేదట. ఈ సారి రోలెక్స్ గా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కనిపించబోతున్నాడట. కేవలం ఐదు నిమిషాల పాత్ర అయినా కూడా ఇంపాక్ట్ మాత్రం సాలిడ్ గా ఉండబోతుందని సమాచారం.

Exit mobile version