పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కుమారుడు అకీరా నందన్ సినిమా ఎంట్రీ విషయమై గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అతిత్వరలోనే అకీరా నటుడిగా అరంగేట్రం చేయనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే రేణుదేశాయ్ కూడా తన పిల్లలు సినిమారంగంలో ఎంట్రీ ఇస్తానంటే వాళ్ళ ఇష్టమని, ఈ విషయంలో తనకేమీ అభ్యంతరం లేదని ఎప్పుడో చెప్పేసింది. మరోవైపు ఎంగా అభిమానులు కేసుల అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీకై వేచి చూస్తున్నారు.
Read Also : వైష్ణవ్ తేజ్, క్రిష్ సినిమాకు అమెజాన్ బిగ్ ఆఫర్ ?
తాజాగా అకీరాకు సంబంధించిన ఓ ఇంటరెస్టింగ్ వీడియోను రేణూదేశాయ్ షేర్ చేసుకుంది. అకీరా ఈ వీడియోలో కర్రసామును చేస్తూ కన్పించాడు. అతను వీడియోలో చాలా షార్ప్‌గా, పట్టుతో కర్రసాము చేయడం చూస్తుంటే అందులో బాగానే నైపుణ్యం సాధించినట్టున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా కరాటే నేర్చుకున్నాడన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన తనయుడు కూడా అదే దారిలో నడుస్తున్నట్టు ఉన్నాడు.
