యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలోని టాప్ స్టార్స్ లో ఒకరు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన “బాహుబలి”తో ఈ పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన నటిస్తున్న భారీ చిత్రాలు నాలుగు నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే తాజాగా ప్రభాస్ రెమ్యూనిరేషన్ విషయమై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆదిపురుష్” చిత్రానికి ప్రభాస్ పారితోషికం ఎంత అనే విషయం చర్చించుకుంటున్నారు. అయితే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న టి-సిరీస్ ఫిల్మ్స్ ప్రభాస్ కు రూ.50 కోట్లు రెమ్యూనరేషన్ గా ఇస్తున్నట్లు సమాచారం. “ఆదిపురుష్” ఏకకాలంలో తెలుగు మరియు హిందీ భాషలలో చిత్రీకరించబడుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, సీత పాత్రలో కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు.