Prabhas: హ్యాపీ బర్త్ డే.. ఎవర్ గ్రీన్ ‘డార్లింగ్’ ప్రభాస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ ఫ్యాన్స్‌కు దీపావళితో పాటు వచ్చే మరో పెద్ద పండుగ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. ప్రతీ ఏడాది అక్టోబర్ 23న ఆయన జన్మదినాన్ని అభిమానులు, సినీ ప్రేమికులు ఘనంగా జరుపుకుంటారు. ప్రభాస్ బర్త్ డే ఇప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు, ఇది ఒక పాన్ ఇండియా స్థాయిలో గుర్తించదగిన వేడుకగా మారింది. దేశం నలుమూలలనే కాకుండా ఓవర్సీస్‌లో యూఎస్, యూకే, జపాన్ వంటి అనేక దేశాల్లో ప్రభాస్‌కు విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాల కోసం, అక్కడి బాక్సాఫీస్ వసూళ్లే ఆయన యూనివర్సల్ క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తాయి. తన స్టార్‌డమ్, ఛరిష్మా, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చారు. ఇండస్ట్రీలో పేరు తెచ్చుకునే హీరోలుంటారు, కానీ టాలీవుడ్‌కే పేరు తెస్తున్న అరుదైన స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన పుట్టినరోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ చిత్రాలు రీ-రిలీజ్ కావడం, కొత్త సినిమాల అప్‌డేట్స్ రావడం ఆనవాయితీ. ఈ నెల 31న ప్రభాస్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘బాహుబలి: ది ఎపిక్’ (రెండు భాగాలు కలిపి ఒకే పార్ట్‌గా) తిరిగి విడుదల కానుండటం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Also Read : Gummadi Narsaiah Biopic : గుమ్మడి నర్సయ్యగా శివ రాజ్ కుమార్
Also Read
క్రేజీ లైనప్
ప్రభాస్ ప్రస్తుతం భారీ పాన్-వరల్డ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన లైనప్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.
ది రాజా సాబ్: డైరెక్టర్ మారుతితో ప్రభాస్ చేస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి జనవరి 9న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. వీటితో పాటు, డైరెక్టర్ హను రాఘవపూడి, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో ఒక సినిమా, సందీప్ వంగా డైరెక్షన్‌లో ‘స్పిరిట్’ చిత్రాలపై ఆకాశాన్నంటే అంచనాలున్నాయి. అలాగే ‘సలార్ 2’, ‘కల్కి 2’ చిత్రాల కోసం కూడా ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
స్టార్ మాత్రమే కాదు.. అందరి ‘డార్లింగ్’
బాక్సాఫీస్ రికార్డులు ప్రభాస్‌ను ‘స్టార్’గా నిలబెడితే, ఆయన వ్యక్తిత్వం ఆయన్ను అందరి ‘డార్లింగ్’ని చేసింది. మచ్చలేని జీవితం, శత్రువు ఎరుగని వ్యక్తిత్వం, చేతికి ఎముకలేని దాతృత్వం, మర్చిపోలేని ఆతిథ్యం.. ఇవే ప్రభాస్‌ను అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మార్చాయి. తెలుగు తెరపై వరుస విజయాలతో ప్రభాస్ మరెన్నో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ.. రెబల్ స్టార్ ప్రభాస్‌కు హ్యాపీ బర్త్ డే!
తాజావార్తలు
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!