Site icon NTV Telugu

Rebal Star: ప్రభాస్ ను ఏమైనా అంటే ఊరుకునేది లేదు.. ఖబర్దార్: మంచు విష్ణు

Untitled Design (31)

Untitled Design (31)

ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన హీరో గ్లోబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమాలో అద్భుత నటనతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ప్రభాస్. బాహుబలి -2 తో ఏకంగా బాలీవుడ్ రికార్డులని తిరగరాసి ప్రభాస్ పేరిట సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. కానీ టాలీవుడ్ నటులు అంటే బాలీవుడ్ కు ఎప్పుడు చిన్న చూపే. మన వాళ్ళు ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసే హిట్స్ ఇచ్చిన సరే తెలుగు వాళ్ళు అనే చిన్న చూపు ఉంది బాలీవుడ్ జనాలకి. ఇటీవల మరోసారి మన టాలీవుడ్ హీరోపై అక్కసు వెళ్లగక్కారు బాలీవుడ్ నటుడు.

Also Read: People Media Factory: “సాలా” సినిమాకు బెస్ట్ విశెస్ అందించిన స్టార్ హీరో

రెబల్ స్టార్ నటించినలేటెస్ట్ రిలీజ్ కల్కి 2898 ఏడీ. వరల్డ్ వైడ్ రికార్డులు నమోదు చేసిన ఈ చిత్రంలో ప్రభాస్ ఓ జోకర్‌లా కనిపించాడని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ మండి పడుతోంది.ప్రభాస్ పై అర్షద్ వార్శి వ్యాఖ్యలను ఖండిస్తూ నటి, సినిమా అంట్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పూనమ్ థిల్లాన్ కు లేఖ రాసిన ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు. ఆర్షద్ ఇక మీదట అలా మాట్లాడకుండా చూసుకోవాలనిం ఆ లేఖలో పేర్కొన్నాడు మంచు విష్ణు మనందరం యాక్టర్స్ ఫ్యామిలీ మనం అలా ఒకరిపై మాట్లాడడం మంచి పద్ధతి కాదని సూచించాడు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన గ్లోబల్ స్టార్ ప్రభాస్ పై ఇలా కామెంట్ చేయడం తెలుగు వారి మనోభావాలు దెబ్బతీసిందని మంచు విష్ణు ఇది ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలి చిన్నపాటి హెచ్చరికలు చేస్తూ లేఖ విడుదల చేసాడు మంచు విష్ణు.

Exit mobile version