Site icon NTV Telugu

Razakar: సివిల్స్ వదిలేసి నటన వైపు.. ఆసక్తికరంగా రజాకార్ నటి జర్నీ..!

Razakar

Razakar

ర‌జాకార్ సినిమాలో నిజాం భార్యగా నటించిన అనుశ్రీ తాజాగా సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆ సినిమాలో తను నటించడం వల్ల గొప్ప ప్రశంసలు అందుకోవడం తనకి చాలా ఆనందంగా ఉందని తెలిపింది. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకి వచ్చిన ర‌జాకార్ సినిమా కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఈ సినిమాలో అనుశ్రీయా త్రిపాఠి కీలక పాత్ర పోషించింది. ఇందుకుసంబంధించి తాజాగా అనుశ్రీ మాట్లాడుతూ.. ఈ సినిమాకి వస్తున్నా రెస్పాన్స్ చూస్తే చాలా ఆనందాన్ని ఇస్తుందని., సినిమా చూసిన ప్రేక్షకులు కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారని తెలిపింది. ముఖ్యంగా సినిమా చూస్తున్న ప్రేక్షకుల కళ్ళల్లో దేశభక్తి కనపడిందని థియేటర్స్ లో భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ నినాదాలు చేస్తుండడం చూసినప్పుడు ఇలాంటి సినిమాలో తాను నటించడం ఆనందంగా అనిపించింది అని చెప్పింది.

Also read: Viral: వింతఘటన.. తోకతో జన్మించిన చిన్నారి..!

ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు యాట సత్యనారాయణకు, నిర్మాత గూడూరు నారాయణ రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది. ఇకపోతే., జీవితంలో తన కాలేజ్ పూర్తయిన తర్వాత తాను సివిల్స్ కు చదవాలని తన నాన్న అనుకున్నట్లుగా తెలిపింది. అయితే తనకి చాలా కాలం నుండి నటిని కావాలనే కోరిక బలంగా ఉండేది అంటూ చెప్పుకొచ్చింది. ఈవిడ బెంగళూరులోని థియేటర్స్ గ్రూప్ లో కూడా సభ్యురాలుగా ఉంది. అయితే ఆమె నటన కలను నెరవేర్చుకోవడం కోసం హైదరాబాద్ వచ్చానని.. ఇక్కడ థియేటర్స్ వర్క్ షాప్ లో పాల్గొన్నట్లు తెలిపింది. ఈ సినిమాలో పాత్ర కొరకు మొదటిగా దర్శకుడిని కలవగా ఆయన నిజాం భార్యగా పాత్ర కోసం వెతుకుతున్నట్లు తెలిపి., తనని ఆ పాత్రకు సెలెక్ట్ చేశాడు.

Also read: Aarambham Naga shivani: ఎమోషనల్ థ్రిల్లర్ ‘ఆరంభం’ నుంచి హీరోయిన్ శివాని నాగరం పాడిన లిరికల్ సాంగ్ రిలీజ్..!

ఇకపోతే సినిమాలో తన పాత్ర గురించి తెలియజేస్తూ.. తాను వాస్తవ పరిస్థితులని నిజాంకు తెలియజేసే దానినని చెప్పుకొచ్చింది. అయితే ఈ పాత్ర చేయడం తనకి సవాల్ గా మారిందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ సినిమాలో ఏకైక గ్లామర్ రోల్ తనదే అని తెలిపింది. తాను ఈ పాత్ర కోసం మూడు నెలల పాటు మెథడ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు తెలిపింది. ఇలాంటి బలమైన పాత్ర తన కెరీర్ గొప్పగా నిలుస్తుందని తెలిపింది. ఇక తనకి ఇష్టమైన హీరో, హీరోయిన్ గురించి చెబుతూ తనకి రణబీర్ కపూర్, రామ్ చరణ్ ల నటన అంటే చాలా ఇష్టం అని., అలాగే హీరోయిన్స్ లో ప్రియాంక చోప్రా, అనుష్క శెట్టి, కీర్తి సురేష్ ఇష్టం అని చెప్పుకొచ్చింది.

Exit mobile version