Rayavalasa : ‘రాయవలస’ నుంచి కార్తీక్ జయంతి సెన్సేషనల్ లుక్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పండుగ పూట సినీ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తూ ‘రాయవలస’ చిత్ర బృందం సరికొత్త సెన్సేషన్‌కు తెరతీసింది. దీపావళి కానుకగా ఈ మూవీ నుంచి మేకర్స్ వదిలిన మాస్ పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. ఇందులో హీరో కార్తీక్ జయంతిని మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ అండ్ రగ్గడ్ మాస్ అవతారంలో చూపించిన తీరు.. సినిమాలో యాక్షన్ ఏ రేంజ్లో ఉండబోతోందో స్పష్టం చేస్తోంది. కేవలం పోస్టర్‌తోనే ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ చేయడంలో డైరెక్టర్ రాధిక జయంతి సక్సెస్ అయ్యారని చెప్పాలి. రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కార్తీక్ సరసన శ్రీష నులు హీరోయిన్గా నటిస్తోంది.
ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ బాల స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ ‘రింగుడు రింగుడు’ యూట్యూబ్‌ను షేక్ చేస్తూ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఈ పాట ఇచ్చిన జోష్‌తో పాటు, ఇప్పుడు దీపావళికి వచ్చిన పవర్ ఫుల్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచేసింది. ఈ ఊర మాస్ ఎంటర్టైనర్ను డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా అత్యంత గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అన్నపూర్ణమ్మ, అనితా చౌదరి, జయప్రకాష్, రవివర్మ, కాశీ విశ్వనాథ్, కంచరపాలెం రాజు లాంటి సీనియర్ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, ధనుంజయ్ వంటి టాప్ సింగర్స్ పాడిన పాటలు సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలవనున్నాయి. వి.ఆర్.కె. నాయుడు సినిమాటోగ్రఫీ, హిట్ చిత్రాల ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్న ఈ ‘రాయవలస’.. డిసెంబర్ 11న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మాస్ మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
Also Read
- Polimera 3 : అనంత పద్మనాభుడి సాక్షిగా క్షుద్రపూజలు.. వేటాడేందుకు కత్తి పట్టిన యాక్షన్ కింగ్!
- Janhvi Kapoor: ఆ సర్జరీ చేయించుకునే వరకు అమ్మ నేను హీరోయిన్గా పనికిరానంది!
- Scene : 3 రోజుల్లో 145 కోట్లు..సూర్య అరాచకం: 'సీన్' మూవీపై మహేష్ బాబు రివ్యూ!
- Dheeraj Mogilineni : బుక్ మై షో ట్రెండింగ్ వెనుక పెద్ద స్కామ్?..'ఫేక్' టికెట్ల బాగోతాన్ని బట్టబయలు చేసిన తెలుగు నిర్మాత
తాజావార్తలు
-
Diwali Cleaning Tips: దీపావళి వేళ నూనె మరకలు జిడ్డుగా మారిపోయాయా? ఈ సింపుల్ చిట్కా చాలు..
-
SBI: ప్రవాసులకు గుడ్ న్యూస్.. అమెరికాలో ఎస్బీఐ గ్రాండ్ ఎంట్రీ!
-
Polimera 3 : అనంత పద్మనాభుడి సాక్షిగా క్షుద్రపూజలు.. వేటాడేందుకు కత్తి పట్టిన యాక్షన్ కింగ్!
-
Janhvi Kapoor: ఆ సర్జరీ చేయించుకునే వరకు అమ్మ నేను హీరోయిన్గా పనికిరానంది!
-
Telangana Rice Prices : బియ్యం ధరలకు బ్రేక్.. కిలోకు గరిష్ట ధరలు ఫిక్స్.!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!