Rayavalasa : ‘రాయవలస’ నుంచి కార్తీక్ జయంతి సెన్సేషనల్ లుక్ రిలీజ్

Rayalasa Diwali

Rayalasa Diwali

పండుగ పూట సినీ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తూ ‘రాయవలస’ చిత్ర బృందం సరికొత్త సెన్సేషన్‌కు తెరతీసింది. దీపావళి కానుకగా ఈ మూవీ నుంచి మేకర్స్ వదిలిన మాస్ పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. ఇందులో హీరో కార్తీక్ జయంతిని మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ అండ్ రగ్గడ్ మాస్ అవతారంలో చూపించిన తీరు.. సినిమాలో యాక్షన్ ఏ రేంజ్‌లో ఉండబోతోందో స్పష్టం చేస్తోంది. కేవలం పోస్టర్‌తోనే ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ చేయడంలో డైరెక్టర్ రాధిక జయంతి సక్సెస్ అయ్యారని చెప్పాలి. రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కార్తీక్ సరసన శ్రీష నులు హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ బాల స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ ‘రింగుడు రింగుడు’ యూట్యూబ్‌ను షేక్ చేస్తూ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఈ పాట ఇచ్చిన జోష్‌తో పాటు, ఇప్పుడు దీపావళికి వచ్చిన పవర్ ఫుల్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచేసింది. ఈ ఊర మాస్ ఎంటర్‌టైనర్‌ను డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా అత్యంత గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అన్నపూర్ణమ్మ, అనితా చౌదరి, జయప్రకాష్, రవివర్మ, కాశీ విశ్వనాథ్, కంచరపాలెం రాజు లాంటి సీనియర్ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, ధనుంజయ్ వంటి టాప్ సింగర్స్ పాడిన పాటలు సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలవనున్నాయి. వి.ఆర్.కె. నాయుడు సినిమాటోగ్రఫీ, హిట్ చిత్రాల ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్న ఈ ‘రాయవలస’.. డిసెంబర్ 11న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మాస్ మ్యాజిక్ చేస్తుందో చూడాలి.