NTV Telugu Site icon

Raviteja : మిస్టర్ బచ్చన్ OTT రైట్స్ డీల్ క్లోజ్..!

Untitled Design (35)

Untitled Design (35)

మాస్ మహారాజ రవితేజ హీరోగా తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. హరీష్ శంకర్, రవితేజ కలయికలో వచ్చిన మిరపకాయ్ సూపర్ హిట్ సాధించింది. రవితేజ గత రెండు, మూడు సినిమాలు అభిమానులను నిరాశ పరిచాయి. ఈ నేపథ్యంలో మిస్టర్ బచ్చన్ పై మాస్ రాజా అభిమానులు అంచనాలు భారీగా ఉన్నాయి.

కాగా మిస్టర్ బచ్చన్  రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా నిర్మాతలు ఇటీవల ఈ డీల్ క్లోజ్ చేసారని టాక్. పీపుల్స్ మీడియా, రవితేజ గత చిత్రం ‘ఈగల్’ సంక్రాంతి కానుకగా రావాల్సి ఉండగా అనుకోని కారణాలవలన వాయిదా పడి కొంత గ్యాప్ త్ర్వాత విడుదలైంది. దాంతో ఈగల్ నాన్ థియేట్రికల్ రైట్స్ ఆగింది. రిలీజ్  చేసాక ఆ  చిత్రం ఫ్లాప్ అవడంతో ఓటీటీ రైట్స్ సేల్ చేయడంతో పీపుల్స్ మీడియాకు కొంత ఇబ్బంది వచ్చింది. ఆ కారణంగా మిస్టర్ బచ్చన్ ను ముందుగానే ముగించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ బచ్చన్ రైట్స్ 19.50కోట్ల రూపాయలకు కొనుగోలు చేసారని సమాచారం.

ఓటీటీ సంస్థలు ఇటీవల కాలంలో ఆచితూచి సినిమాలు కొనుగోలు చేస్తున్నాయి. స్టార్ హీరో, స్టార్ దర్శకుడు ఉంటె తప్ప కొనేందుకు ముందుకు రావట్లేదు సదురు సంస్థలు. చిన్న సినిమాలను కేవలం పే పర్ వ్యూ మోడల్ లో మాత్రమే తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మిస్టర్ బచ్చన్ భారీ ధరకు అమ్ముడయ్యాయని చెప్పొచు. రవితేజ, హరీష్ శంకర్ కలయికలో రానున్న నేపథ్యంలో బచ్చన్ భారీ ధర పలికింది. బచ్చన్ ఏ మాత్రం మెప్పిస్తాడో మరికొద్ది రోజుల్లో తేలనుంది.

 

Also Read: Balayya : బాలకృష్ణ 50 ఏళ్ల ఇండస్ట్రీ ఉత్సవం..ఎప్పుడంటే..?