NTV Telugu Site icon

Ravi Teja vs Ram Pothineni: బాక్సాఫీస్ వద్ద రామ్ పోతినేని‌తో రవితేజ క్లాష్

Ravi Teja Vs Ram Pothineni

Ravi Teja Vs Ram Pothineni

Ravi Teja to clash with Ram Pothineni at the box office: మాస్ మహారాజా రవితేజ కొన్ని క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే! వాటిల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా ఒకటి. ఒకప్పుడు పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టిన పేరుమోసిన దొంగ నాగేశ్వరరావు నిజ జీవితం ఆధారంగా.. భారీ స్కేల్‌లో పాన్ ఇండియాగా ఇది రూపొందుతోంది. టైటిల్ అనౌన్స్‌మెంట్ దగ్గర నుంచే ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి చిత్రబృందం ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తమ సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. దీన్ని బట్టి.. ఈ సినిమా పనులు ఎంత వేగంగా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. వంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు.

Kangana Ranaut: ప్రియాంకాను కరణ్ జోహర్ బ్యాన్ చేశాడు.. మరోసారి బాంబ్ పేల్చిన కంగనా

అయితే.. అక్టోబర్ 20వ తేదీన బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబోలో రూపొందుతున్న RAPO20 కూడా రిలీజ్ అవుతోంది. దీన్ని కూడా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు. దీంతో.. ఈసారి బాక్సాఫీస్ వద్ద రవితేజ, రామ్ మధ్య క్లాష్ ఏర్పడింది. ఇది మాస్ ఆడియన్స్‌కి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. కాగా.. టైగర్ నాగేశ్వరరావు సినిమా 1970 బ్యాక్‌డ్రాప్‌లో స్టువర్టుపురం విలేజ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం రవితేజ తన అవతారాన్ని మార్చుకున్నాడు. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఇందులో కొత్తగా కనిపించబోతున్నాడు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌పై అభిషేక్ అగర్వాల్ భారీ బడ్జెట్‌తో నిర్మి్స్తున్నాడు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమాతో మాస్ మహారాజా రవితేజ పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటాలని చూస్తున్నాడు.

Vishwak Sen: మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించిన విశ్వక్ సేన్.. డైరెక్టర్ ఎవరంటే?

Show comments