Ravi Teja: హిట్ కాదు మాస్టారూ.. రవితేజ ఓకే చేసిన సినిమా ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస సినిమాలతో దూసుకుపోతున్న మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమా మీద పూర్తి ఫోకస్ పెట్టాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది కానీ షూటింగ్లో ఆయనకు గాయాలు కావడంతో కాస్త ఆలస్యమైంది. ఇక ఆయన హిట్ సిరీస్లో కూడా భాగం అవ్వబోతున్నాడు అనే ప్రచారం మొదలైంది. శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ సినిమాలో విశ్వక్సేన్, హిట్ 2 సినిమాలో అడవి శేషు నటించగా మూడవ సినిమాలో నాని నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇక నాలుగవ సినిమాలో రవితేజ నటించబోతున్నాడు అనే ప్రచారం జరుగుతుండగా అది నిజం కాదని తాజాగా టీం నుంచి అందుతున్న సమాచారం. ఇదిలా ఉండగా రవితేజ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మ్యాడ్ సినిమా దర్శకుడు కళ్యాణ్ శంకర్ చెప్పిన కథకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.
Mahesh Babu: SSMB 29 లో మరో బాలీవుడ్ నటుడు..!
Also Read
ఈ ఏడాది రెండవ భాగంలో సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాడ్ సినిమా సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతానికి దానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. మ్యాడ్ 2 పేరుతో ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కళ్యాణ్ శంకర్ రవితేజ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టబోతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రవితేజ మరిన్ని కథలు కూడా వింటున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కూడా మ్యాడ్ సలహా లోనే ఒక కామెడీ సినిమాగా ఉండబోతుందని అంటున్నారు. అదే నిజమైతే ఆ జానర్ లో మంచి పట్టు ఉన్న రవితేజ మరో హిట్ కొట్టడం ఖాయం..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!