మాస్ మహారాజా రవితేజ కెరీర్లో మరో ఇంట్రెస్టింగ్ మూవీకి శ్రీకారం చుడుతున్నారు. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రవితేజ ప్రస్తుతం ‘మాస్ జాతర’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 27న ఈ సినిమా విడుదల కానుండగా, మరోవైపు ఆయన తన తదుపరి సినిమాను కామెడీ స్పెషలిస్ట్ కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Also Read : Allu Arjun : బన్నీ – రష్మిక కాంబో రిటర్న్స్!
‘MAD’, ‘MAD స్క్వేర్’ వంటి యువతను ఆకట్టుకున్న హాస్య చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ శంకర్ – ఇప్పుడు రవితేజతో కలిపి ఓ సోషియో ఫాంటసీ జానర్లో సినిమా చేయనున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఇది ప్రేక్షకులకు ఒక రకమైన షాక్‌గా మారింది. ఎందుకంటే, కళ్యాణ్ శంకర్ అంటే కామెడీకి కేరాఫ్, రవితేజ అంటే మాస్ యాక్షన్. అయితే ఈసారి వాళ్లిద్దరూ కలిసి కామెడీకి కాకుండా, విభిన్నమైన కాన్సెప్ట్‌పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. సమాచారం ప్రకారం సోషియో ఫాంటసీ సినిమాలకు వీఎఫ్ఎక్స్ కీలకం. అందుకే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులను చాలా డీటైల్‌గా ప్లాన్ చేస్తున్నారు.
స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయిందని సమాచారం. డిసెంబర్ 2025 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముంది. ఇంకో హైలైట్ ఏంటంటే, ఈ ప్రాజెక్ట్‌కు మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవి శ్రీ ప్రసాద్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రవితేజ–DSP కాంబినేషన్ అంటే మెయిన్ హైలైట్ ఉండటం ఖాయం. విభిన్నమైన బీజీఎమ్, పాటలు ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచే అవకాశం ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. సోషియో ఫాంటసీ జానర్ అంటే వీఎఫ్ఎక్స్ తో ముడిపడి ఉంటుంది. అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్‌కి ఎక్కువ సమయం పడుతుంది. మామూలుగా రవితేజ సినిమాలు వేగంగా పూర్తవుతుంటాయి. మరి ఈ చిత్రం ఎంత సమయం తీసుకుంటుందో చూడాలి.