Site icon NTV Telugu

Ravi Teja Horror Movie: రవితేజ సినిమాలో విలన్‌గా స్టార్ డైరెక్టర్.. థియేటర్లలో బ్లాస్ట్ పక్కా!

Ravi Teja Sj Suryah

Ravi Teja Sj Suryah

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ కన్ఫర్మ్ అయింది. ‘మాస్ మహారాజా’ రవితేజ నటించనున్న హారర్ చిత్రంలో ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్‌జే సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాంతో రవితేజ కొత్త సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ సినిమాకు వివేక్ అత్రేయ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

కథ, స్క్రీన్‌ప్లే పరంగా ప్రత్యేకమైన మార్క్ ఉన్న వివేక్ అత్రేయ.. హారర్ జానర్‌లో రవితేజను కొత్త కోణంలో చూపించబోతున్నారనే టాక్ ఇప్పటికే వినిపిస్తోంది. ఇప్పుడు ఎస్‌జే సూర్య విలన్‌గా చేరడంతో ఈ ప్రాజెక్ట్ మరింత ఆసక్తికరంగా మారింది. ఎస్‌జే సూర్య అంటేనే ఎనర్జీ, ఇంటెన్సిటీ, పవర్‌ఫుల్ నెగటివ్ షేడ్స్ గుర్తొస్తాయి. గతంలో ఆయన చేసిన విలన్ పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఎనర్జీకి మారుపేరైన రవితేజ, సూర్య కలిసి నటిస్తే.. థియేటర్లలో బ్లాస్ట్ ఖాయమని అభిమానులు అంటున్నారు.రవితేజ హారర్ సినిమా, వివేక్ అత్రేయ కథనం, ఎస్‌జే సూర్య విలనిజం.. ఈ కాంబినేషన్ టాలీవుడ్‌లో ఓ బిగ్ బంగర్‌గా మారనుంది.

Also Read: CM Chandrababu: నగరి టీడీపీకి కంచుకోట.. తప్పకుండా కృష్ణా జలాలు అందిస్తాం!

ఎస్‌జే సూర్య తెలుగులో స్పైడర్, సరిపోదా శనివారం సినిమాల్లో విలన్‌గా నటించారు. స్పైడర్‌లో అద్భుతంగా చేశాడంటే.. సరిపోదా శనివారంలో విశ్వరూపం చూపించారు. రెండు సినిమాల్లో హీరోల కంటే ఎస్‌జే సూర్య క్యారెక్టర్ గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. రవితేజ సినిమాలో కూడా బలమైన క్యారెక్టర్ ఉండనుంది. సరిపోదా శనివారం తర్వాత వివేక్‌ ఆత్రేయ చస్తున్న సినిమా ఇదే. వివేక్‌ ఆత్రేయ చెప్పిన కథకు రవితేజ ఇంప్రెస్‌ అయ్యారట. రవితేజ తాజాగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో మంచి హిట్ ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.

Exit mobile version