RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!

Ravi Teja

Ravi Teja

RT78: టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా ఊరిస్తున్న క్రేజీ కాంబినేషన్‌కు ఎట్టకేలకు అధికారిక ముద్ర పడింది. మాస్ మహారాజా రవితేజ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఎవరితో చేయబోతున్నారన్న సస్పెన్స్‌కు తెరదించుతూ మేకర్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. విలక్షణ కథలతో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త సినిమా చేయబోతున్నారు. రవితేజ కెరీర్‌లో 78వ మైలురాయిగా (#RT78) రాబోతున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్‌లో ఒక్కసారిగా జోష్ పెరిగింది. ఈ ప్రాజెక్ట్‌పై ఎప్పటినుంచో ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నప్పటికీ, చిత్ర నిర్మాణ సంస్థ ‘ది బ్రిడ్జ్ ప్రొడక్షన్స్’ అధికారికంగా ప్రకటించడంతో నెట్టింట వైరల్ అవుతోంది.

లక్ష్మణ్, శ్రీనిరావు సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ మార్క్ అన్‌స్టాపబుల్ ఎనర్జీకి.. వివేక్ ఆత్రేయ మార్క్ ఇంటెలిజెంట్, విభిన్న స్క్రీన్‌ప్లే తోడైతే వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ అవుతుందోనని సినీ ప్రియులు లెక్కలు వేసుకుంటున్నారు. రవితేజను పూర్తిగా సరికొత్త అవతారంలో చూపించేలా వివేక్ అదిరిపోయే కథను సిద్ధం చేశారని టాక్. ఇక ఈ సినిమాలో రవితేజకు జోడీగా నటించే హీరోయిన్ ఎవరు? కీలక పాత్రల్లో ఎవరెవరు కనిపించనున్నారు? అనే విషయాలను మేకర్స్ ఇంకా రివీల్ చేయలేదు. అయితే వీటన్నింటికీ సమాధానం అక్టోబర్ 11న గ్రాండ్‌గా రివీల్ చేయనున్నట్లు యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. టైటిల్ పోస్టర్‌తో పాటే సినిమా జానర్, హీరోయిన్, తారాగణంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉండటంతో ఆ రోజు కోసం మాస్ మహారాజా ఫ్యా్న్స్ చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.