Site icon NTV Telugu

Rashmika Mandanna: ఇంటి కోసం వీధుల్లో తిరిగిన సందర్భాలున్నాయి

Rashmika

Rashmika

Rashmika Mandanna: పేదరికం, కష్టాల నుండి కొందరికి ఎలాగైనా ఎదగాలని కసి పుడుతుంది. ఆకసిలో ఏదైనా సాధించి ఉన్నత స్థాయికి వెళ్లాలనే తపన రగుల్చుతుంది. అలాంటి కోవకు చెందింన వారిలో అనుసూయ కూడా తన ఓ ఇంటర్వూలో తన గత జీవితం చెప్పుకుని కన్నీరు పెట్టుకున్న సందర్భాలున్నాయి. ఇక అదే కోవలో రష్మిక చేరింది. తాజాగా ఓ ఇంటర్వూలో తన గత జీవితం గురించి చెప్పుకుంది. ఆమెకథ వింటే కన్నీరు ఆగవు. ప్రతి సక్సెస్‌ వెనుక ఒక విశాధ గాధ తప్పకుండా ఉంటుందనే చెప్పడానికి నవ్వుల రష్మిక గురించి వింటే చాలు ఎప్పుడు బిజీగా ఉండే రష్మిక వెనుక ఇంత విషాధ గాధ వుందా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. దేశం మొత్తం మెచ్చిన హీరోయిన్ అయ్యారు. తన చిన్నతనంలో రష్మిక అత్యంత దుర్భరమైన పేదరికం అనుభవించారట.

Read also: Viral Video: మంచికి రోజుల్లేవంటే ఇదేనేమో.. చివరికి కన్ను పోయిందిగా..

కొద్దిరోజుల క్రితం ఓ ఛానల్‌ ఇంటర్వూలో ఆమె మాట్లాడుతూ.. తాను చిన్నపిల్లగా ఉన్నప్పటి పేదరికాన్ని రష్మిక మందాన గుర్తు చేసుకుంది. తన జీవితంలో ఎలాంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కుందో తెలియజేసింది. ఇక రష్మిక పేరెంట్స్ ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉండేవారని, నెలాఖరున ఇంటి అద్దె స్తొమత కూడా ఉండేది కాదట. దానివల్ల ఇంటి యజమానులు ఖాళీ చేయిస్తూ ఉండేవారట. ప్రతి రెండు నెలలకు కొత్త ఇల్లు వెతుక్కోవడం నిత్యకృత్యం అయ్యేదట. దీంతో నిలువ నీడ కోసం వీధుల్లో తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయని.. పేరెంట్స్ నేను ఏది అడిగినా కాదనేవారు కాదు. అయినప్పటికీ నేను ఏమీ అడిగేదాన్ని కాదు. ఎందుకంటే కనీసం ఒక బొమ్మ అడిగినా అది కొనడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కావు. అప్పటి నుంచి ఇప్పటికీ నేను అప్పటి అమ్మాయి మైండ్ సెట్లోనే ఉన్నాను.

Read also: Gaza Birthday incident : బర్త్ డే వేడుకలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన 17మంది సజీవదహనం

దాని ప్రభావమే.. ఇప్పటికి వరకు డబ్బులు అంటే నాకు చాలా గౌరవం. జీవితంలో వచ్చిన ఈ సక్సెస్, ఫాన్స్, స్టార్డం ని ఈజీగా తీసుకోనని..ఎంతో కష్టపడి ఈ స్థాయికి రావడం జరిగిందని రష్మిక వెల్లడించారు. అప్పుడు ఇంటికోసం వీధిల్లో తిరిగిన రష్మిక హీరోయిన్ అయ్యాక కోట్లు సంపాదిస్తున్నారు. రష్మిక రెమ్యునరేషన్ రూ. 3 కోట్లకు పైమాటే. తాజాగా.. ముంబైలో రష్మిక విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతేకాదు… బెంగుళూరులో ఆమెకు పెద్ద ఇల్లు, కార్లు, ఆస్తులు ఉన్నాయి. సమాచారంతో.. ఒకటి రెండు సందర్భాల్లో రష్మికపై ఐటీ దాడులు జరిగాయి. రష్మిక ఇప్పటి స్థితికి ఆమె బాల్యంలో అనుభవించిన పరిస్థితులు పొంతనలేదు. ఎవరి మద్దతు లేకుండా స్వయం కృషితో ఎదిగారు. ఇక ప్రస్తుతం రష్మిక చేతిలో మూడు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తెలుగులో.. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 మూవీలో రష్మిక నటిస్తున్నారు. బాలీవుడ్‌ లో రన్బీర్ కపూర్ కి జంటగా యానిమల్ మూవీ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా ఈ చిత్ర దర్శకుడు. అంతేకాకుండా.. విజయ్ వారసుడు మూవీలో రష్మిక నటిస్తున్నారు. అయితే.. సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.
Viral Video: మంచికి రోజుల్లేవంటే ఇదేనేమో.. చివరికి కన్ను పోయిందిగా..

Exit mobile version